హిందువులే టార్గెట్ ఎందుకు? ఇది హిందూ ధర్మ సహనం-వివేక్ రామస్వామి వీడియో వైరల్

Published : Nov 11, 2024, 05:57 PM IST
హిందువులే టార్గెట్ ఎందుకు? ఇది హిందూ ధర్మ సహనం-వివేక్ రామస్వామి వీడియో వైరల్

సారాంశం

అమెరికాలో ఒకరు హిందూ  మతాన్ని దుష్టశక్తిగా, ఇతర మతాలకు వ్యతిరేకిగా వివాదాస్పద కామెంట్స్ పై  వివేక్ రామస్వామి ప్రశాంతంగా స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన హిందూ ధర్మ సహనంపై చర్చను లేవనెత్తింది. ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

Hinduism - Vivek Ramaswamy: అమెరికాలో రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా జరిగిన ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో హిందు ధర్మ, హిందుమతం పై జరుగుతున్న దాడులపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ కార్యక్రమంలో వివేక్ రామస్వామి - ఒక అమెరికన్ పౌరుడి మధ్య జరిగిన చర్చ హాట్ టాపిక్ అయ్యింది. ఆ అమెరికన్ పౌరుడు హిందు మతాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.  "హిందూ ధర్మాన్ని ఒక చెడుగా, దుష్టశక్తిగా పేర్కొన్నాడు. అది విగ్రహారాధన చేసే మతంగా" అంటూ కామెంట్స్ చేశాడు. క్రిస్టియానిటీకీ వ్యతిరేకి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. 

అయితే, అతని రెచ్చగొట్టే మాటలకు ఎలాంటి ఆగ్రహానికి గురికాకుండా వివేక్ రామస్వామి ప్రశాంతంగా స్పందించారు. హిందూ ధర్మ సహనం, లౌక్యం విషయాలను ప్రస్తావించారు. ద  బయటపడ్డాయి. ఇతర మతాల గురించి ఇలా అంటే ఏమయ్యేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వివేక్ రామస్వామి ప్రదర్శించిన ప్రశాంత వ్యక్తిత్వం, వ్యాఖ్యలు పరమత సహనానికి అద్దం పట్టాయి. 

 

 

అమెరికాలో హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నాలు

అమెరికాలో కొన్ని ఎవాంజెలికల్ గ్రూపులు హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని విగ్రహారాధన అనీ, అమెరికన్ విలువలకు విరుద్ధం అంటూ  ఇలా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. క్రైస్తవ లేదా ఇస్లాం ధర్మాల గురించి ఇలా అంటే వచ్చే స్పందనలు హిందుయిజం పై దాడి జరిగినప్పుడు రావడం లేదు. హిందూ దర్శనంలో ఉన్న సహనం ఇక్కడ కనిపిస్తుంది. వాదించడానికి లేదా చట్టానికి పోయే బదులు, రామస్వామి ప్రశాంతంగా తన విశ్వాసాన్ని సమర్థించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే