విషాదం : ప్రముఖ సింగర్ కన్నుమూత

Published : Oct 17, 2024, 09:36 AM ISTUpdated : Oct 17, 2024, 10:07 AM IST
విషాదం : ప్రముఖ సింగర్ కన్నుమూత

సారాంశం

అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సింగర్ లియమ్ ఫేన్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. 

అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్ లియామ్ ఫెయినే కన్నుమూసాడు. అర్జెంటినా లోని ఓ హోటల్ మూడో అంతస్తు నుండి కిందపడి అతడు మరణించాడు. 

అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో ఈ ప్రమాదం జరిగింది. హోటల్ వెనకవైపు పెద్ద శబ్దం రావడంతో సిబ్బంది వెళ్లిచూడగా ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడివున్నాడు. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 

అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా అప్పటికే అతడు చనిపోయివున్నాడు. అసలు చనిపోయింది ఎవరని ఆరా తీయగా బ్రిటీష్ బాయ్ బ్యాండ్ వన్ డైరెక్షన్ మాజీ సింగర్ గా తేలింది. 
 
 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?