
ఓ వ్యక్తి నేరం చేసిన దాదాపు 30 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. అయితే, పోలీసులు తనను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న సమయంలో అతను చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తాను జైలుకి వెళ్లిపోతున్నానని, మరో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని ఆయన తన భార్యకు చెప్పడం విశేషం. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హుబేయ్ ప్రావిన్స్ కు చెందిన జూహు అనే వ్యక్తి దాదాపు 30ఏళ్ల క్రితం అంటే 1993లో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 30 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. మిగిలిన ముగ్గురు దొరికారు కానీ, జుహు మాత్రం తప్పించుకున్నాడు. అతను ఆ తర్వాత గ్యాంగ్ జౌ అనే నగరానికి వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు.
అక్కడే ఓ అమ్మాయిని చూసుకొని పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే, ఇటీవల అతని ఆచూకీ పోలీసులకు దొరికింది. దీంతో అతనిని పట్టుకున్నారు. అయితే, జూహూ ని హుబేయ్ కి తరలించేందుకు పోలీసులు రైల్వే స్టేషన్ కి తీసుకువచ్చారు. ఆ సమయంలో అతనితో పాటు ఆయన భార్య, సోదరి కూడా వచ్చారు.
అయితే, తనను పోలీసులు అరెస్టు చేసుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు భార్యను చూడగానే జూహూ చాలా ఎమోషనల్ అయ్యాడు. వెంటనే తన భార్యను హత్తుకొని ఏడ్చేశాడు. అనంతరం తాను జైలుకి వెళ్లిపోతున్నానని, ఆమెను మరో పెళ్లి చేసుకోవాలని చెప్పడం విశేషం. భర్త చెప్పిన మాటలకు ఆమె కూడా ఏడ్వడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
అంతేకాదు, తన భార్య సోదరితో ఆయన మాట్లాడుతూ తన భార్యను విడాకులు సిద్ధం అంగీకరించమని చెప్పడం విశేషం. తాను ఇక జైలు నుంచి బయటకు రాకపోవచ్చని, ఆమెను పెళ్లి అంగీకరించేలా చేసి, మరో పెళ్లి మీరే దగ్గరుండి చేయాలని చెప్పారట. అయితే, ఆమె మాత్రం అందుకు నిరాకరించడం గమనార్హం.