పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రీజర్ లో దాక్కున్నాడు.. కానీ...

Published : Jul 11, 2023, 01:27 PM IST
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రీజర్ లో దాక్కున్నాడు.. కానీ...

సారాంశం

పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. ప్రీజర్ లో దాక్కున్నాడో వ్యక్తి. ఆ తరువాత అందులోనుంచి బైటికి రాలేక మృత్యువాత పడ్డాడు. 

అమెరికా : యునైటెడ్ స్టేట్స్‌లో గత నెల ఖాళీగా ఉన్న ఇంట్లోని ఫ్రీజర్‌లో చనిపోయిన వ్యక్తి ఉదంతం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో మృతుడు పరారీలో ఉన్న నిందితుడిగా తేలాడు. పోలీసుల నుండి దాక్కునే ప్రయత్నంలో ఐస్‌బాక్స్‌లో దూరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని స్కైన్యూస్ తెలిపింది.

దీని ప్రకారం, 34 ఏళ్ల బ్రాండన్ లీ బుష్‌మాన్ జూన్ 26న మిన్నెసోటాలోని ఖాళీగా ఉన్న ఓ ఇంటి నేలమాళిగలో చెస్ట్ ఫ్రీజర్‌లో చనిపోయి కనిపించాడు. అతను పోలీసులనుండి తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఫ్రీజర్ లో దాక్కున్నాడు.  

నేపాల్‌లో హెలికాప్టర్ మిస్సింగ్.. అందులో ఐదుగురు విదేశీయులు..!!

బుష్‌మాన్ ను అరెస్ట్ చేయడానికి పోలీసుల దగ్గర కఠినమైన వారెంట్ కూడా ఉంది. అతనిని వెంబడిస్తున్న సమయంలో కనిపించకుండా పోయాడు. ఆ తరువాత ప్రీజర్ లో మృతదేహంగా దొరికాడు. కాగా,పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తనంతట తానుగా ఫ్రీజర్ లో దూకి ఉంటాడని.. అయితే ఆ తరువాత బైటికి రాలేక.. అందులోనే చిక్కుకుపోయి మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోస్టుమార్టంలో అతని శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని తేలింది. గత ఏప్రిల్‌ నుంచి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. కరెంట్ కనెక్షన్లన్నీ తీసేసి ఉన్నాయి. దీంతో మృతదేహం దొరికిన సమయంలో పరికరం ఆన్‌లో లేదని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆ ఇంట్లో ఎవరూ లేరని అధికారులు తెలిపారు.

ప్రెస్ నోట్ ప్రకారం, బుష్‌మాన్ మృతదేహం దొరికిన చెస్ట్ ఫ్రీజర్ పాత మోడల్ ది. దాన్ని లోపలినుంచి తెరవలేము. దీనివల్లే.. అందులోకి దూరిన తరువాత బుష్ మాన్ బైటికి రాలేకపోయాడని అందులో పేర్కొన్నారు. లాచింగ్ మెకానిజమ్‌ను తెరవడానికి విఫల ప్రయత్నం చేసినదానికి గుర్తుగా లోహపు కడ్డీ ఫ్రీజర్ లోపలి నుండి చొప్పించినట్లుగా తేలింది. 

బుష్‌మాన్ చివరిసారిగా సజీవంగా కనిపించిన తేదీకి సంబంధించి.. మరింత ఖచ్చితంగా నిర్థారించడానికి టాక్సికాలజీకి సంబంధించిన తుది పోస్ట్‌మార్టం నివేదికల కోసంవేచి ఉన్నారు. అయితే, బుష్‌మాన్ ఏ నేరానికి పాల్పడ్డాడో మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే