అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్...

By SumaBala BukkaFirst Published Dec 1, 2022, 11:09 AM IST
Highlights

అమెరికా మాజీ అధ్యక్సుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. తాను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్నానని బిల్ క్లింటన్ స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

అమెరికా : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు కోవిడ్-19గా తేలింది. కరోనా టెస్టులో కరోనా పాజిటివ్ గా తేలింది. తనకు కోవిడ్ సోకిందని, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నానంటూ స్వయంగా బిల్ క్లింటన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాస్త నలతగా ఉండడంతో కరోనా టెస్టులు చేయించుకున్నానని.. అందులో పాజిటివ్ గా తేలిందని తెలిపారు. 

లక్షణాలు పెద్దగా లేవని, స్వల్పంగానే ఉన్నాయని.. ఆయినా తాను బాగానే ఉన్నానని.. చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికే వ్యాక్సిన్ తో పాటు  బూస్టర్ డోసులు వేసుకున్నానని.. దీనివల్లే తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. 

ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హసన్ ఖురేషీ మృతి.. కొత్త నాయకుడెవరంటే...

అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని బిల్ క్లింటన్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను దక్షిణ కాలిఫోర్నియాలోని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్లో ఆయన బ్లెడ్ రిలేటెడ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇంతలోనే.. మళ్లీ ఇప్పుడు ఆయన కోవిడ్ బారిన పడ్డారు.

బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా వరుసగా రెండు సార్లు పనిచేశారు. 2001 తర్వాత వైట్ హౌస్ నుంచి వెళ్లిన తరువాత ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో ఛాతిలో తీవ్రమైన నొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనకు నాలుగు సార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో 2005లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్యలు తిరగబెట్టాయి. దీంతో మరోసారి చికిత్స చేసి రెండు స్టంట్లు వేశారు. 

ఆ తర్వాత కొన్ని రోజులకు బిల్ క్లింటన్ కోలుకున్నారు. ఈ సమయంలో కొద్ది రోజుల పాటు బిల్ క్లింటన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎన్నికల్లో డెమోక్రాట్లు తరుపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. హిల్లరీ క్లింటన్ తరఫున పలుసార్లు ప్రచార బాధ్యతలను కూడా చేపట్టారు. ఇదే క్రమంలో, క్లింటన్ పౌండేషన్ కు సంబంధించిన కార్యక్రమం కోసం కాలిఫోర్నియాలో ఉన్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని సమాచారం. అయితే. కొద్ది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంది. 

click me!