మదర్సాలో బాంబు పేలుడు.. 15 మంది మృతి.. పలువురు పరిస్థితి విషమం..  

By Rajesh KarampooriFirst Published Nov 30, 2022, 6:51 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుడు: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐబాక్ నగరంలోని జహ్దియా మదర్సాలో మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం జరిగిన బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 15 మంది మరణించారు. దాదాపు 27 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే.

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు: ఆఫ్ఘనిస్థాన్‌లోని సమంగాన్‌లోని అయ్‌బాక్ నగరంలో బుధవారం (నవంబర్ 30) బాంబు పేలుడు సంభవించింది. జహ్దియా మదర్సాలో మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందగా, సుమారు 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 16 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.  

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని మత పాఠశాలలో జరిగిన బాంబు పేలుడులో 15 మంది విద్యార్థులు మరణించారని తాలిబాన్ అధికారి తెలిపారు. ఉత్తర సమంగాన్ ప్రావిన్స్ రాజధాని ఐబాక్‌లో జరిగిన పేలుడులో పలువురు గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు.

చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే.. 
 
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన 200 కి.మీ దూరంలో ఉన్న అయ్బక్‌ నగరంలోని మదర్సాలో జరిగిన పేలుడులో ఎక్కువ మంది యువకులేనని అయ్బక్‌ నగరానికి చెందిన చెప్పారు. తాలిబాన్ గత సంవత్సరం దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి యుద్ధంలో దెబ్బతిన్న దేశ భద్రతపై దృష్టి సారించిందని చెప్పారు.
 
కాబూల్‌లోని ఓ కారులో పేలుడు  

అంతకుముందు నవంబర్ 21 న, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారని కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. హత్యకు గురైన వారి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అలాగే ఈ పేలుడు వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియరాలేదు. గత సంవత్సరం ఆగస్టులో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, పౌరులను లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్దీ పేలుళ్లు, దాడులు జరిగాయి. 

click me!