ఫ్లోరిడాలో కాల్పుల కలకలం.. మూడు నెలల బాలుడు సహా నలుగురి మృతి

By telugu news teamFirst Published Sep 6, 2021, 7:57 AM IST
Highlights

నిందితుడు రిలేకి.. మృతులతో ఎలాంటి సంబంధం లేదని.. అతను విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. 

ఫ్లోరిడాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తల్లీ, బిడ్డలు కూడా ఉన్నారు. తల్లితోపాటు.. ఆమె చేతిలో ఉన్న మూడు నెలల బాబు కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

 నిందితుడిని బ్రయాన్ రిలే(33) గా గుర్తించారు. కాగా.. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 11ఏళ్ల బాలిక.. తీవ్రంగా గాయపడింది. బాలికకు ఏడు తుపాకీ గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

నిందితుడు రిలేకి.. మృతులతో ఎలాంటి సంబంధం లేదని.. అతను విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడిని అరెస్టు చేసే సమయంలో.. పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించాడని అధికారులు చెబుతున్నారు.

ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో యుఎస్ యుద్ధాల అనుభవజ్ఞుడైన రిలే అంగరక్షకుడు, సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. కాగా.. నాలుగేళ్లుగా అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అతని ప్రియురాలు పోలీసులకు చెప్పడం గమనార్హం.

రిలే కాల్పులు జరిపే సమయంలో.. బాధితులంతా కాల్చవద్దని చాలా సేపు వేడుకున్నారట. అయినా కూడా వదిలిపెట్టకుండా కాల్చేశాడట. ఈ విషయాన్ని నిందితుడు దర్యాప్తులో చెప్పడం గమనార్హం.

click me!