ఆరు నెలల్లో చైనాలో తొలి కరోనా మరణం నమోదు

By Mahesh KFirst Published Nov 20, 2022, 7:04 PM IST
Highlights

చైనాలో గడిచిన ఆరు నెలల్లో తొలి కరోనా మరణం నమోదైనట్టు ఆదివారం ఆ దేశం వెల్లడించింది. మే నెల నుంచి తొలిసారిగా దేశంలో కరోనా మరణం చోటుచేసుకుంది. గడిచిన 24 గంటల్లో చైనాలో సుమారు 24 వేల కేసులు నమోదయ్యాయి.
 

న్యూఢిల్లీ: చైనాలో గడిచిన ఆరు నెలల్లో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి చైనా ప్రభుత్వం ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత ఆరు నెలల్లో చైనాలో ఆదివారం తొలిసారి కరోనా మరణం నమోదైంది.

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌‌తో దాదాపు కలిసి జీవించే విధానాన్ని అలవాటు చేసుకున్నాయి. కానీ, ఈ వైరస్ ను కట్టడి చేయడానికి చైనా భారీగా టెస్టులు, క్వారంటైన్‌లు, లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నది. నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 24 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే.. ఈ సంఖ్య స్వల్పమే. అయితే, గడిచిన ఆరు నెలల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

Also Read: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కోవిడ్-19 పాజిటివ్..

చైనాలో మైల్డ్ కేసుగా నమోదైన ఓ వ్యక్తి చివరకు మరణించారని చైనా అధికార మీడియా సీసీటీవీ రిపోర్ట్ చేసింది. కానీ, ఆ పెద్ద వయస్సు పేషెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆయన ప్రాణం తీసిందని తెలిపింది. గతంలో చాలా కఠినంగా నిబంధనలు అమలు చేసిన చైనా అధికారులు ఈసారి కొంత సడలించి అమలు చేస్తున్నారు. 

click me!