పార్లమెంటులో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు గంటల పాటు ఏకదాటిగా మంటలు.. 80 అగ్నిమాపక యంత్రాలు

Published : Jan 02, 2022, 07:14 PM ISTUpdated : Jan 02, 2022, 07:17 PM IST
పార్లమెంటులో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు గంటల పాటు ఏకదాటిగా మంటలు.. 80 అగ్నిమాపక యంత్రాలు

సారాంశం

దక్షిణాఫ్రికా పార్లమెంటులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఈ పార్లమెంటులో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే పార్లమెంటు భవనం పైకప్పు మొత్తం వ్యాపించాయి. తొలుత మూడో అంతస్తులో మంటలు మొదలైనట్టు తెలిసింది. తర్వాత జిమ్నాషియం వైపు వ్యాపించాయి. ఆరు గంటలపాటు మంటలు మండాయి. 80కి మించి అగ్నిమాపక యంత్రాలు, 30 బృందాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు.

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా(South Africa) రాజధాని కేప్ టౌన్‌(Cape Town)లోని పార్లమెంటు(Parliament)లో భారీ అగ్ని ప్రమాదం(Fire) సంభవించింది. ఆకాశంలోకి అగ్ని కీలలు ఎగసి పడ్డాయి. ఏకదాటిగా ఆరు గంటల పాటు మంటలు మండాయి. 80 అగ్ని మాపక యంత్రాలు స్పాట్‌కు చేరుకున్నాయి. క్రేన్‌ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. కానీ, ఆరు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. భవనం పైకప్పు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. పార్లమెంటు భవనంతోపాటు నేషనల్ అసెంబ్లీ, మరో భవనం చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. 

మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ, ఈ మంటలు పార్లమెంటు పాత భవనంలోని మూడో అంతస్తులో మొదలైనట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ తర్వాత అవి జిమ్నాషియం వైపు వ్యాపించాయని పేర్కొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదంపై సహాయం కోసం అర్థించారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో పేరు పొందిన నేత డెస్మాండ్ టుటు అంత్యక్రియలు ఈ పార్లమెంటుకు సమీపంలోనే జరిగాయి. ఈ అంత్యక్రియలు శనివారం జరిగిన గంటల వ్యవధిలోనే తాజా ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ అసెంబ్లీ పైకప్పు మొత్తం మంటలు అంటుకున్నాయని సిటీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి వెల్లడించారు. ఈ మంటలు ఇంకా అదుపులోకి రాలేవని సాయంత్రం ఆయన తెలిపారు. ఈ మంటలను వెంటనే అదుపులోకి తేకుంటే తీవ్ర నష్టం వాటిల్లే ముప్పు ఉన్నదని చెప్పారు. అంతేకాదు, మంటల కారణంగా బిల్డింగ్ గోడల్లోనూ పగుళ్లు వచ్చినట్టు వివరించారు.

Also Read: పార్లమెంటులో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. రాజ్యాంగ సవరణపై తీవ్ర చర్చ.. ఘర్షణలు

మంటలను అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సుమారు 80కి పైగా అగ్ని మాపక యంత్రాలు స్పాట్‌కు చేరుకున్నాయి. సుమారు 30 బృందాల అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడకు చేరింది. కింది నుంచి సరైన చోట నీరు చేరడం లేదని భావించి.. కొన్ని క్రేన్‌ల సహాయం తీసుకుని పై నుంచి నీటిని మంటలపై స్ప్రే చేశారు. ఎట్టకేలకు సుమారు ఆరు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్న సంగతి తెలిసిందే. కేప్‌టౌన్‌లో ఆ దేశ పార్లమెంటు ఉంటుంది.  ఈ నగరంలో పార్లమెంటు భవనం సహా నేషనల్ అసెంబ్లీ, ప్రావిన్స్‌ల నేషనల్ కౌన్సిల్ ఎగువ సభ కూడా ఉంటుంది.

కేప్‌టౌన్‌లో గతేడాది ఏప్రిల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేప్‌టౌన్ యూనివర్సిటీలో ఈ ప్రమాదం జరిగింది. అపార ఆఫ్రికన్ సాహిత్యాన్ని దాచిపెట్టిన యూనివర్సిటీ లైబ్రరీ మంటలకు బూడిద అయిపోయింది.

Also Read: Parliament Winter Session: పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా.. షెడ్యూల్‌ కంటే ఒక్క రోజు ముందే.. వివరాలు ఇవే

వాళ్లంతా చట్టసభ్యులు.. దేశ ప్రగతి దిశను నిర్దేశించేవారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు. దేశానికి కావాల్సిన చట్టాలు తెచ్చే వేదికైన పార్లమెంటు(Parliament)లోనే వాళ్లు స్థిమితం కోల్పోయినట్టు కనిపించారు. సహనం లేకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు (Fist Fight) కురిపించుకున్నారు. తోసుకోవడం, కిందపడిపోవడం సింపుల్‌గా జరిగిపోయింది. అయితే, పార్లమెంటులో జరిగే చర్చ కదా.. దేశానికంతా చూపించాలనే ఆలోచనలతో ఓ చానెల్ లైవ్ టెలికాస్ట్ (Live telecast) చేసింది. ఇంకేముంది.. ఈ రచ్చంతా దేశ ప్రజలు లైవ్‌లో చూశారు. అంతేనా.. ఆ క్లిప్పులు ఇప్పుడు సోషల్ మీడియాకూ ఎక్కాయి. జోర్డన్ దేశ పార్లమెంటులో.. ఈ ఘర్షణలు బుధవారం జరిగాయి. జోర్డన్(Jordan) క్యాపిటల్ అమ్మాన్‌లోని ప్రతినిధుల సభలో చోటుచేసుకున్నాయి.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !