న్యూజిలాండ్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం, 6గురు మృతి, 11మంది మిస్సింగ్..

By SumaBala BukkaFirst Published May 16, 2023, 8:59 AM IST
Highlights

న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోని ఓ హాస్టల్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. 11 మందికి పైగా తప్పిపోయారు. 

న్యూజిలాండ్ : న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌లోని ఓ బహుళ అంతస్తుల హాస్టల్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు.11 మందికి పైగా తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

"ఇంకా చాలా మంది వ్యక్తుల ఆచూకీ తెలియడంలేదు. తప్పిపోయిన వారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య ఇప్పటికి ఇది.. అయితే ఇంతే అని ప్రస్తుతానికి నిర్ధారించలేం" అని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ న్యూజిలాండ్ తెలిపింది. 

న్యూటౌన్‌లోని వెల్లింగ్‌టన్ పరిసరాల్లోని లోఫర్స్ లాడ్జ్ పై అంతస్తులో అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదని వార్తా సంస్థలు చెబుతున్నాయి.  

పాకిస్తాన్‌లో బొగ్గు గని డీలిమిటేషన్ విషయంలో రెండు తెగల మధ్య ఘర్షణ, 15 మంది మృతి

ప్రధాన మంత్రి క్రిస్ హిప్‌కిన్స్ ఓ టెలివిజన్ షోలో మాట్లాడుతూ ఆరుగురు మరణించారని, మృతుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారన్నారు. ఆ భవనంలో 92 గదులున్నాయని.. అందులోకి ప్రవేశించే వరకు తమకు భవనం ఎంత సురక్షితమో తెలియదని పోలీసులు తెలిపారు. అంతేకాదు.. భవనం పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటి వరకు 52 మంది అందులో ఉన్నట్టుగా గుర్తించారు. 

"ఈ ప్రమాదం బారిన పడిన వారందరికీ ఇది ఒక విషాదకరమైన సంఘటన. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మీయులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను" అని జిల్లా మేనేజర్ కమాండర్ నిక్ ప్యాట్ ఒక ప్రకటనలో తెలిపారు. "దశాబ్దకాలంలో వెల్లింగ్టన్‌లో సంభవించిన అతిపెద్ద అగ్నిప్రమాదం. ఇది అత్యంత భయంకరమైన పీడకల" అని ఆయన అన్నారు. 
 

click me!