పాకిస్తాన్‌లో బొగ్గు గని డీలిమిటేషన్ విషయంలో రెండు తెగల మధ్య ఘర్షణ, 15 మంది మృతి

By SumaBala BukkaFirst Published May 16, 2023, 8:28 AM IST
Highlights

బొగ్గు గని డీలిమిటేషన్ విషయంలో పాకిస్థాన్‌లోని దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో సన్నీఖేల్, జర్గున్ ఖేల్ తెగల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది మరణించారు.

పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌ వాయువ్య ప్రాంతంలోని బొగ్గు గనిని డీలిమిటేషన్ చేయడంపై సోమవారం రెండు తెగల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో 15 మంది మరణించారని, మరికొంతమంది గాయపడ్డారని మంగళవారం పిటిఐ తెలిపింది. 

కోహట్ జిల్లాలోని పెషావర్‌కు నైరుతి దిశలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో సన్నీఖేల్, జర్గున్ ఖేల్ తెగలు ఉన్నాయి. ఈ తెగల మధ్య గని డీలిమిటేషన్ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఎవరెస్ట్ శిఖరాన్ని 26 సార్లు అధిరోహించిన రెండో వ్యక్తిగా నేపాలీస్ షెర్పా పసాంగ్ దావా రికార్డ్

మృతదేహాలను, క్షతగాత్రులను పెషావర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి సంఖ్య వెంటనే తెలియరాలేదని, అయితే ఎదురుకాల్పుల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, ఇతర భద్రతా బలగాల సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు తెగల మధ్య కాల్పులను నిలిచేలా చేశాయి.

ఈ ఘటనకు సంబంధించి దర్రా ఆడమ్ ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బొగ్గు గని డీలిమిటేషన్‌పై సన్నీఖేల్, జర్ఘున్ ఖేల్ తెగల మధ్య గత రెండు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది.  దీనిమీద నెలకొన్న ప్రతిష్టంభనను ముగించే ప్రయత్నంలో అనేక సయోధ్య "జిర్గాస్" లు జరిగాయి.
 

click me!