కెనడాలో కొండ చిలువను ఆయుధంగా మలుచుకుని ప్రత్యర్థిపై దాడి చేసిన వ్యక్తి.. వీడియో వైరల్

By Mahesh KFirst Published May 15, 2023, 7:01 PM IST
Highlights

కెనడాలో ఓ వ్యక్తి కొండ చిలువను ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థిపై దాడి చేశాడు. ఆ పాముతో చితకబాదాడు. అంతలో పోలీసులు స్పాట్‌కు రావడంతో పామును అక్కడే పడేసి లొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

Python: పాములను పెంచుకోవడమే అరుదు.. అంటే.. ఆ పామును పట్టుకుని వీధుల్లో తిరగడం, గొడవ జరిగితే ఎదుటి వ్యక్తిపై పామును ఆయుధంగా వాడుకుని దాడి చేయడం.. ఇదంతా అరుదుల్లోకెల్లా అరుదు. పెంచుకుంటున్న కొండ చిలువ పామును ఆయుధంగా చేసుకుని ఎదుటి వ్యక్తిపై దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన కెనడాలో బుధవారం రాత్రి 11.50 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

కెనడాలోని టొరంటోలో దుందాస్ స్ట్రీట్ వెస్ట్, మానింగ్ అవెన్యూ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ కనిపించారు. ఈ విషయాన్ని పోలీసులకు స్థానికులు తెలియజేశారు. ఇద్దరిలో ఒకరు ఉన్నట్టుండి కొండ చిలువ పామును ఆయుధంగా మలుచుకుని మరో వ్యక్తిపై దాడి చేయడం ప్రారంభించాడు. ఎదుటి వ్యక్తి భయపడుతూ కిందపడిపోయాడు. ఆ పాము నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే కిందపడిపోయాడు. అంతలోనే అక్కడికి పోలీసుల కారు వచ్చింది. 

Dude uses his pet snake as a weapon during street fight in Toronto 😳 pic.twitter.com/T2lLKaLe4E

— Crazy Clips (@crazyclipsonly)

వెంటనే పామును అక్కడే కింద వదిలేసి ఆ వ్యక్తి సరెండర్ అయ్యాడు. ఆ పాము పరిస్థితి ఏమిటన్నది స్పష్టంగా తెలియలేదు. ఓ వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. 

Also Read: Hyderabad: లంచాలు తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు.. మియాపూర్ పోలీసుల సరికొత్త ప్లాన్! వెల్లడించిన ఏసీబీ

టొరంటోకు చెందిన లౌరెనియో అవిలా అనే 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ పామును గాయపరిచినందుకూ అభియోగాలు మోపారు. 

ఆ వీడియో కింద చాలా మంది పాము గురించి ఆరా తీశారు. దాని ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నలు వేశారు.

click me!