కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం.. ముగ్గురు మృతి.. మూడు రోజుల్లో రెండో ఘటన

By Asianet NewsFirst Published May 2, 2023, 10:42 AM IST
Highlights

కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ సింగిల్ ఇంజిన్ విమానం బిగ్ బేర్ ఎయిర్ పోర్టుకు సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 

కాలిఫోర్నియా బిగ్ బేర్ ఎయిర్ పోర్టుకు సమీపంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ సింగిల్ ఇంజిన్ విమానం కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. బీచ్ క్రాఫ్ట్ ఎ 36 బిగ్ బేర్ సిటీ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

యువతులకు తెలియకుండా బాత్ రూమ్, బెడ్ రూమ్ లలో స్పై కెమెరాలు పెట్టిన ఇంటి ఓనర్.. వారి వీడియోలను చూస్తూ..

అయితే విమానం ఖాళీ స్థలాన్ని ఢీకొట్టిందని, ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. బాధితులను వెంటనే గుర్తించలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉందని నివేదికలు తెలిపాయి. ఈ బిగ్ బేర్ విమానాశ్రయం బిగ్ బేర్ లేక్ సమీపంలోని శాన్ బెర్నార్డినో పర్వతాలలో ఉంది. ఇది లాస్ ఏంజిల్స్ కు తూర్పున రెండు గంటల ప్రయాణంలో ఒక ప్రసిద్ధ రిసార్ట్ ప్రాంతం. 

బ్రేకింగ్ : తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హతం.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఘటన

దక్షిణ కాలిఫోర్నియాలో మూడు రోజుల్లో జరిగిన రెండో ఘోర విమాన ప్రమాదం ఇది. శనివారం దట్టమైన పొగమంచు వ్యాపించి ఉండటంతో లాస్ ఏంజిల్స్ పరిసరాల్లోని ఇళ్లపై సమీపంలో ఉన్న గడ్డి కొండపై సింగిల్ ఇంజిన్ విమానం కూలింది. దీంతో ఒకరు మరణించారు. సెస్నా సి 172 అనే విమానం శనివారం రాత్రి 8:45 గంటలకు వాన్ నుయిస్ విమానాశ్రయానికి ఆగ్నేయంగా 8 మైళ్ళ (13 కిలోమీటర్లు) దూరంలో కూలిపోయిందని లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం,ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపాయి.

కాకినాడలో విషాదం.. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారి.. డోర్ లాక్ అవడంతో ఊపిరాడక మృతి

తొలుత ఇది కారు ప్రమాదమని సమీపంలో ఉండే ప్రజలు అనుకున్నారు. కానీ చుట్టుపక్కల వెతికినా ఏమీ కపించలేదని, అదేమిటో తమకు కనిపించలేదని చెప్పారు. అయితే కొంత సమయం తరువాత సెర్చ్ అండ్ రెస్క్యూ టీం కొండపై కనిపించేసరికి విమాన ప్రమాదమని తమకు అర్థమైందని తెలిపారు. చీకటిలో, దట్టమైన పొగమంచులో గంటల తరబడి సిబ్బంది ప్రమాద స్థలాన్ని వెతికి గుర్తించారని, శిథిలాల కింద ఒకరు మరణించారని, ఆ విమానంలో పైలట్ ఒక్కడే ఉన్నాడని ‘ఎఫ్ఏఏ’ తెలిపింది.

హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చి చంపేస్తాం - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

శనివారం రాత్రి 8 గంటల తర్వాత వాన్ నుయిస్ విమానాశ్రయానికి వెళ్తుండగా రాడార్ తో విమానం సంబంధాన్ని కోల్పోయిందని, దీంతో విమానం కనిపించకుండా పోయిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ప్రాథమికంగా నివేదించారని అగ్నిమాపక శాఖ ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేపట్టాయి.

click me!