పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్.. థాయ్‌లాండ్‌లో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అరెస్ట్..!!

By Sumanth KanukulaFirst Published May 1, 2023, 1:06 PM IST
Highlights

క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్‌ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యాడు.

క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్‌ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యాడు. థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేయగా.. అందులో 80 మందికి పైగా భారతీయులు ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరిని ప్రవీణ్ అక్కడికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. 

ఇక, నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను థాయ్‌లాండ్‌ పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. గేమింగ్ చిప్స్‌ విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. 

ఏప్రిల్ 27-మే 1 వరకు హోటల్‌లో అనేక మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని.. జూదం కోసం సంపావో అనే సమావేశ గదిని అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్‌ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడి జరిగిందని అక్కడి  పోలీసులు వెల్లడించారు. పోలీసులు వచ్చి చూసేసరికి సంపావో గదిలో పెద్ద సంఖ్యలో జూదగాళ్లు బక్కరా, బ్లాక్‌జాక్‌లు ఆడుతూ కనిపించారని తెలిపారు. వారు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు.  83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్‌లాండ్‌లు, నలుగురు మయన్మార్ జాతీయులను(మొత్తం 93 మందిని) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

click me!