కుక్క ప్రేమ : 27 రోజులు, 64-కిమీ నడిచి.. తన మాజీ యజమానిని చేరుకున్న గోల్డెన్ రిట్రీవర్...

By SumaBala BukkaFirst Published May 1, 2023, 4:40 PM IST
Highlights

కొత్త యజమాని ఇంటినుంచి ఓ పెంపుడు కుక్క దాదాపు ఒక నెల పాటు అదృశ్యమైంది. చివరికి అది 64 కిమీ ప్రయాణించి తిరిగి తన అసలు యజమానులకు ఇంటికి చేరుకుంది.

"పెంపుడు కుక్క చూపించే ప్రేమకు సాటివచ్చే ప్రేమ లేదు" అని పెట్ లవర్స్ చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా, ఒక గోల్డెన్ రిట్రీవర్ రిట్రీవర్ ను అనుకోసి పరిస్థితుల వల్ల దాని యజమానులు వదులుకోవలసి వచ్చింది. దాన్ని అడాప్ట్ చేసుకున్న మరో కుటుంబం.. కుక్కను తమతో పాటు తీసుకెళ్లాడు. అయితే తన కొత్త యజమాని ఇంటికి సమీపిస్తుండగా అది కారులోనుంచి దూకి తప్పించుకుంది. అక్కడినుంచి తన పాత యజమాని దగ్గరికి దాదాపు 64 కి.మీ. లు ప్రయాణించి ఒంటరిగా చేరుకుంది. 

మెట్రో నివేదిక ప్రకారం, కూపర్ అనే కుక్క ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌లోని తన కొత్త యజమాని ఇంటికి వచ్చిన వెంటనే కారు నుండి దూకింది. అలా వెళ్లిన కుక్క దొరకలేదు. దాదాపు ఒక నెల పాటు దాని ఆచూకీ లేదు. ఆ తరువాత దాని అసలు యజమానుల వద్దకు తిరిగి లండన్‌డెరీ కౌంటీలోని టోబెర్‌మోర్‌కు దాదాపు 40 మైళ్ళు (64కిమీ) దూరం పరిగెత్తి చేరుకుంది. 

దారుణం.. కాలింగ్ బెల్ కొట్టి ఆటపట్టించి, వీపు మీద చరిచి పారిపోయే ప్రయత్నం చేసిన.. ముగ్గురు టీనేజర్ల హత్య..

మిస్సింగ్ పెంపుడు జంతువుల స్వచ్ఛంద సంస్థ లాస్ట్ పావ్స్ ఎన్‌ఐ మాట్లాడుతూ, కుక్క అక్కడక్కడా పొలాల్లో కనిపించిందని.. ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఉందని ఏప్రిల్ 22న తమకు టిప్-ఆఫ్ అందిందని చెప్పారు. ఐదు రోజుల తరువాత, కూపర్ తన పాత యజమాని ఇంటి వైపు పరుగెత్తుతున్నట్లు మరొకరు సమాచారం అందించారు. కుక్క ఒంటరిగా అడవుల్లో, ప్రధాన రహదారుల వెంబడి నడుస్తూ వెళ్లింది. ఎక్కువగా మనుషుల సంచారం లేని.. రాత్రిపూట ఎక్కువగా ప్రయాణం చేసిందని తెలుసుకున్నారు. 

లాస్ట్ పావ్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. కూపర్ చాలా తెలివైన కుక్క. తనకు తెలిసిన ప్రదేశానికి చేరుకోవడానికి దృఢసంకల్పమే తోడ్పడింది. కూపర్ ఎలా చేయగలిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆహారం లేదు, ఆశ్రయం లేదు, సహాయం లేదు, కేవలం దృఢ సంకల్పం మాత్రమే దానికి తోడుంది... అని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం కూపర్.. కొత్త యజమాని నిగెల్ ఫ్లెమింగ్ దగ్గర ఉన్నాడు. నిగెల్ మాట్లాడుతూ.. కూపర్ సురక్షితంగా ఉంది, బలాన్ని పుంజుకోవడానికి మంచి ఆహారం ఇస్తున్నాం. లాస్ట్ పావ్స్ చేసిన సహాయం మరిచిపోలేము.. అన్నారు. 

click me!