బార్ లో పరిచయమైన వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లి.. డ్రింక్ లో బొద్దింకల స్ప్రే కలిపిచ్చిన మహిళ, అరెస్ట్...

Published : Aug 21, 2023, 02:52 PM IST
బార్ లో పరిచయమైన వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లి.. డ్రింక్ లో బొద్దింకల స్ప్రే కలిపిచ్చిన మహిళ, అరెస్ట్...

సారాంశం

వెరోనికా క్లైన్ అనే మహిళ బార్ లో పరిచయమైన ఓ వ్యక్తికి మద్యంలో బొద్దింకల మందు స్ప్రే చేసి ఇచ్చింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 

ఫ్లోరిడా : అమెరికాలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తాగే డ్రింక్ లో బొద్దింకల స్ప్రే చేసి, తాగించినందుకు ఒక మహిళ అరెస్టు అయ్యింది. వోలుసియా షెరీఫ్ కార్యాలయం ప్రకారం, వెరోనికా క్లైన్‌ అనే మహిళను గత వారం అరెస్టు చేశారు. ఆమె మీద ఆహారం, పానీయాలలో విషం కలిపినట్లు అభియోగాలు మోపారు. 

29 ఏళ్ల క్లైన్‌ను తాను బార్‌లో కలిశానని, బార్ మూసేస్తుండడంతో మద్యం సేవించడం కొనసాగించేందుకు తన నివాసానికి రమ్మని నిందితురాలు ఆహ్వానించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడని ఫాక్స్ న్యూస్ నివేదించింది. 

ఏడుగురు శిశువులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ నర్సుకు జీవిత ఖైదు...

ఆమె ఇంటికి వెళ్లిన తరువాత రెండు డ్రింక్స్ తాగాడు. ఆ తరువాత వెంటనే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడటం ప్రారంభించాడు. తాను తాగిన రెండు రౌండ్ల డ్రింక్ లో యాంట్, రోచ్ స్ప్రే బ్రాండ్ బొద్దింకల స్ప్రే కలిపినట్లు క్లైన్ తనతో చెప్పిందని అతను పేర్కొన్నాడు.

సుమారు 30 నిమిషాల పాటు తీవ్రమైన వాంతులతో బాధపడిన వ్యక్తి చివరికి సహాయం కోసం కాల్ చేయగలిగాడు. అతని ఫోన్ కాలు అందుకుని శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు డెలియోన్ స్ప్రింగ్స్‌లోని వీలర్ స్ట్రీట్‌లోని నివాసానికి పోలీసులు వచ్చారు.

వారికి తన వాంగ్మూలాన్ని ఇస్తున్నప్పుడు, బాధితుడు మళ్లీ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో వెంటనే అతడిని వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి క్లైన్ ఇంట్లోనుంచి పారిపోయింది.

ఆమె కోసం వెతికిన పోలీసులకు ఇంటిబయట తోటలో మొక్కల మధ్య దాక్కున్న ఆమె కనిపించింది. డాగ్స్ సహాయంతో ఆమె ఆచూకీ కనుక్కుని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన తరువాత ఆమెను వోలుసియా బ్రాంచ్ జైలుకు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..