తాలిబన్ల నీడలో జైషే, లష్కర్, హక్కానీ ముఠాలు.. ప్రపంచ భద్రతకు ముప్పే: విదేశాంగ మంత్రి జైశంకర్

Siva Kodati |  
Published : Aug 19, 2021, 09:34 PM IST
తాలిబన్ల నీడలో జైషే, లష్కర్, హక్కానీ ముఠాలు.. ప్రపంచ భద్రతకు  ముప్పే: విదేశాంగ మంత్రి జైశంకర్

సారాంశం

తాలిబన్లలో భాగమైన హక్కానీ నెట్‌వర్క్ ముప్పుగా పరిణమిస్తోందన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. అలాగే జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలకు తాలిబన్ల నుంచి మద్ధతు లభిస్తుందని వాటిని ఎదుర్కొవడానికి సిద్ధంగా వుండాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.  

తాలిబన్లతో ప్రపంచ భద్రతకు ప్రమాదమేనని స్పష్టం చేశారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడిన జైశంకర్ ఆఫ్గన్ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తాలిబన్లలో భాగమైన హక్కానీ నెట్‌వర్క్ ముప్పుగా పరిణమిస్తోందన్నారు జైశంకర్. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలకు తాలిబన్ల నుంచి మద్ధతు లభిస్తుందని  వాటిని ఎదుర్కొవడానికి సిద్ధంగా వుండాలన్నారు. 

Also Read:ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి

కాగా, రోజుల వ్యవధిలోనే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. విదేశీ రాయబారులు ఉండే కాబూల్ రాజధానినీ అతివేగంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి సిద్ధమవని దేశాలు తమ దౌత్య అధికారులు, పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లడానికి తంటాలు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత పౌరులు, దౌత్య సిబ్బంది మొత్తం సుమారు 130 మందిని అక్కడి నుంచి విజయవంతంగా తరలించగలిగింది. ఇందుకోసం ఓ సీక్రెట్ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టింది. ఉపగ్రహ చిత్రాలు ఈ ఆపరేషన్ తీరుతెన్నులను వెల్లడించాయి.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?