ఆఫ్ఘనిస్తాన్ : మా పిల్లనైనా కాపాడండి, బిడ్డల్ని విసిరేస్తున్న మహిళలు.. కాబూల్‌లో హృదయ విదాకర దృశ్యాలు

By Siva KodatiFirst Published Aug 19, 2021, 7:39 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన నేపథ్యంలో ప్రజలు విమానమెక్కి విదేశాలకు వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్నారు. అటు దేశం విడిచి వెళ్లాలి అనుకునే పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయంలోకి వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుగా వేశారు. కొందరు మహిళలైతే తమను కాకపోయినా తమ బిడ్డలను అయినా కాపాడాలంటూ వేడుకుంటున్నారు. 

కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద హృదయ విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు జనం ప్రాణాల్ని సైతం లెక్క చేయడం లేదు. విమానమెక్కి విదేశాలకు వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్నారు. దేశం విడిచి వెళ్లాలి అనుకునే పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయంలోకి వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుగా వేశారు. కొందరు మహిళలైతే తమను కాకపోయినా తమ బిడ్డలను అయినా కాపాడాలంటూ వేడుకుంటున్నారు.

చిన్నారులను ఫెన్సింగ్ నుంచి బయటకు విసిరివేస్తున్నారు. తమ చిన్నారులను ఆదుకోవాలని అమెరికా, బ్రిటన్ బలగాలను     మహిళలు వేడుకుంటున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ తన బిడ్డను ఫెన్సింగ్ నుంచి బయటకు ఇచ్చింది. ఆ చిన్నారిన బ్రిటిష్ సైన్యం ఆదుకుంది. ఈ దృశ్యాలను చూసి తమను ఎంతగానో కలిచి వేస్తున్నాయని  బ్రిటీష్ సైనికులు చెబుతున్నారు. కొందరు చిన్నారులను కాపాడి తమ సంరక్షణలో వుంచుకున్నారు.

Also Read:తాలిబాన్లపై గెరిల్లా పోరాటం? ‘దళం సిద్ధంగా ఉంది.. ఆయుధాలు పంపండి’

మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేందుకు జనం గుమికూడటంతో తాలిబన్లు చెలరేగిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఒక్కసారిగా జనం ఎగబడటంతో కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు మహిళలు తమ పిల్లను కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. రోజులు గడుస్తున్నా కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద పరిస్ధితిలో మార్పు వుండటం లేదు. తమకు విమానంలో చోటు దక్కకపోతుందా.. ఈ దేశాన్ని విడిచి ప్రాణాలను కాపాడుకోలేకపోతామా అన్న ఆశతో అక్కడే రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. 

click me!