
ఆఫ్గనిస్థాన్ (Afghanistan) మరోసారి భారీ బాంబు పేలుళ్లతో (bomb blasts) దద్దరిల్లింది. శుక్రవారం ఉత్తర ఆఫ్గానిస్థాన్‌లోని కుందుజ్ (kunduz )ప్రావిన్స్‌లో గోజర్-ఈ-సయ్యద్ అబాద్ మసీదులో భారీ పేలుడు సంభవించింది. షియాలకు సంబంధించిన మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ పేలుడులో భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ ఘటన సమయంలో మసీదులో వందలాది మంది ముస్లింలు ఉన్నట్టు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే తాలిబన్ల (talibans) ముఖ్య అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ (zabihullah mujahid )మీడియా ముందుకు వచ్చారు. షియాల మసీదు (shia muslim) లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వెల్లడించారు. అలాగే, భారీగా గాయాలపాలైనట్టు తెలిపారు. తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ముజాహిద్ చెప్పారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ప్రకటన చేయలేదు.
ALso Read:ఆఫ్గన్‌లో బహిరంగ శిక్షల అమలు: వ్యాపారి కిడ్నాప్ చేసిన వారిని కాల్చివేత, క్రేన్లకు మృతదేహాల వేలాడదీత
ఈ ఏడాది ఆగస్టు 15న ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అధ్యక్షుడిగా వున్న అష్రఫ్ గనీ దేశం విడిచి పారిపోయారు. తర్వాత ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పంజ్ షీర్ నుంచి తాలిబన్లపై యుద్ధం చేశారు. అయితే అది కూడా పాకిస్తాన్ సపోర్ట్‌తో పంజ్‌షీర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అటు అమెరికా సేనలు కూడా వైదొలగడంతో తాలిబన్లు నాటి నుంచి గతంలోని చట్టాలను అమలు చేస్తున్నారు.