Nobel peace prize 2021: ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి

By narsimha lodeFirst Published Oct 8, 2021, 2:56 PM IST
Highlights

2021 ఏడాదికి గాను మరియా రెస్సా, థమిత్రి మురతో‌వ్‌కి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన ఇద్దరూ కూడ జర్నలిస్టులే. ఫిలిప్ఫిన్స్ కు చెందిన మరియా రెస్సా తో పాటు రష్యాకు చెందిన థమిత్రి మురతో‌వ్‌కి  nobel peace prize దక్కింది.

స్టాక్‌హోం: 2021 ఏడాదికి గాను మరియా రెస్సా, థమిత్రి మురతో‌వ్‌కి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ఈ మేరకు రాయల్ స్వీడీష్ అకాడమీ శుక్రవారం నాడు ప్రకటన విడుదల చేసింది.నోబెల్ శాంతి బహుమతి కోసం 329 నామినేషన్లు అందాయి. వీరిలో మరియా రెస్సా, థమిత్రి మురతో‌వ్‌కి నోబెల్ శాంతి పురస్కారానికి నిర్వాహకులు ఎంపిక చేశారు.

also read:nobel prize 2021:రసాయనశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రైజ్

నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన ఇద్దరూ కూడ జర్నలిస్టులే. ఫిలిప్ఫిన్స్ కు చెందిన మరియా రెస్సా తో పాటు రష్యాకు చెందిన థమిత్రి మురతో‌వ్‌కి  nobel peace prize దక్కింది.ప్రజాస్వామ్యాన్ని రక్షించడంతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు వీరిద్దరూ తమ వంతు శక్తివంచన లేకుండా కృషి చేశారని  నార్వే రీజియన్ నోబెల్ కమిటీ అధ్యక్షురాలు బెరిట్ రీస్ అండర్సన్ చెప్పారు.

రాప్లర్ సైట్ ను శ్రీమతి ressa స్థాపించారు. అధికార దుర్వినియోగం, హింస, పిలిప్ఫిన్స్ లో పెరుగుతున్న నిరంకుశత్వాన్ని బహిర్గంత చేయడానికి ఆమె ప్రయత్నించింది. మరో వైపు నోవాజా గెజిటాను muratov స్థాపించారు. 24 ఏళ్లుగా ఈ పత్రికకు ఆయన సంపాదకుడిగా ఉన్నారు. రష్యాలో మాట్లాడే స్వేచ్ఛను కోసం ఆయన పనిచేశారు.

ఉచిత, స్వతంత్ర వాస్తవ ఆధారిత జర్నలిజం ద్వారా అధికార దుర్వినియోగం, అబ్దాల నుండి ప్రజలు రక్షించబడతారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.గత ఏడాది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆకలిని ఎదుర్కోవడంతో పాటు శాంతి కోసం పరిస్థితులను మెరుగుపర్చేందుకు చేసిన కృషికి ఈ అవార్డు అందించారు.

click me!