Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభానికి కార‌ణాలివే: ప్రధాని మహింద రాజపక్స

Published : Apr 12, 2022, 02:00 AM IST
Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభానికి కార‌ణాలివే: ప్రధాని మహింద రాజపక్స

సారాంశం

Sri Lanka Crisis: శ్రీలంక‌లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. కోవిడ్ లాక్‌డౌన్ వ‌ల్ల దేశ‌ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని,   విదేశీ నిల్వలను గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని, దీంతో ఆర్థిక వ్య‌వ‌స్థపై ప్ర‌భావం ప‌డింద‌ని,  క్షీణించేలా చేసిందని శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజపక్స తెలిపారు.శ్రీలంకవాసులపై రికార్డు ద్రవ్యోల్బణం, సాధారణ బ్లాక్‌అవుట్‌లతో పాటు ఆహారం, ఇంధన కొరతలు పూర్తిగా దుస్దితిలోకి నెట్టినట్లు మహీంద తెలిపారు.  

Sri Lanka Crisis: శ్రీలంక తీవ్ర‌ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆర్ధిక వ్యవహారాల్ని చక్కదిద్దడంలో పాల‌కులు చూపిన నిర్లక్ష్యమే ఆ దేశానికి శాపమ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రధాని మహీంద రాజపక్స  జాతినుద్దేశించి ప్రసంగించారు. కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని అరికట్టడానికి   ప్రభుత్వం శ‌త‌విధాలుగా కృషి చేస్తుంద‌ని అన్నారు. ఇందు కోసం.. ప్ర‌జ‌లు ఓపికగా ఉండాలని ప్రజలను అభ్యర్థించారు. వీధుల్లో నిరసనల వల్ల నగదు కొరత ఎదుర్కొంటున్న మన దేశానికి ఆర్థిక సాయం అందకుండా పోతోందని మహింద రాజపక్స అన్నారు,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీలంక ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స శ్రీలంక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

లిబరేషన్ టైగర్స్ ఫర్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడిన శ్రీలంక యుద్ధ వీరులను నిరసనకారులు అవమానిస్తున్నారని, దేశంలోని యువత అవమానాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారని రాజపక్సే ఆరోపించారు. కరోనా మహమ్మారి విజృంభణ నుంచి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామ‌నీ. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని తెలిసినప్పటికీ లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు.  దీంతో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటాయనీ,  ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధ్యక్షుడితో కలిసి అను క్ష‌ణం పనిచేస్తున్నామ‌ని అని మహింద రాజపక్స పేర్కొన్నారు. 

ఈ సంక్షోభం వ‌ల్ల త‌న కుటుంబ అందరికంటే ఎక్కువ అవమానాలకు గురైందనీ, అవమానాలతో బాధపడుతున్నామని తెలిపారు శ్రీలంక  వ్యవసాయ రంగాన్ని 100 శాతం సేంద్రీయంగా మార్చే   ప్రయత్నంలో, గత సంవత్సరం రద్దు చేయబడిన రసాయన ఎరువుల సబ్సిడీలను తిరిగి ప్రవేశపెట్టడానికి రాజపక్సే ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు.

ప్రతిపక్షాలను ఉద్దేశించి రాజపక్సే మాట్లాడుతూ.. "దేశంలో ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరినప్పటికీ, ఎవరూ ముందుకు రాలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం వ్య‌క్తం చేశారు.  ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం కాబోదని, సంక్షోభ పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే