‘పాకిస్తాన్‌లో ఇక నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్’.. కొత్త పీఎం స్పీచుల్లో గాల్లోకి ఎగిరిన మైక్‌లు.. వీడియో వైరల్

Published : Apr 11, 2022, 07:06 PM IST
‘పాకిస్తాన్‌లో ఇక నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్’.. కొత్త పీఎం స్పీచుల్లో గాల్లోకి ఎగిరిన మైక్‌లు.. వీడియో వైరల్

సారాంశం

పాకిస్తాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గతంలో ఆయన పలు సందర్భాల్లో ప్రసంగిస్తూ చేతులను వేగంగా కదిలించారు. ఈ కదలికలు ఆయన ఎదుట ఉన్న మైక్‌లు కూడా గాల్లోకి ఎగిరాయి. వీటికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.  

న్యూఢిల్లీ: పాకిస్తాన్ నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్ నెట్టింట వైరల్ అవుతున్నారు. గతంలో తాను చేసిన కొన్ని ప్రసంగాల తాలూకు వీడియోల క్లిప్ ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గతంలో పలు సందర్భాల్లో ఆయన ఉద్వేగభరితంగా ఊగిపోతూ మాట్లాడిన సందర్భాలు కొన్ని కెమెరాలకు చిక్కాయి. ఆ ఆవేశంతోపాటు ఆయన చేతులూ అంతే వేగంగా గాల్లో కదులాడుతుండటాన్ని మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఆ చేతులకు తాగి తరుచూ ఆయన ఎదురుగా మైక్‌లు కూడా గాల్లోకి ఎగరడాన్ని చూస్తే నవ్వు ఆపుకోం. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియో అటు పాకిస్తాన్‌లో, ఇండియాలో వైరల్ అవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ వీడియో ఆధారంగా మీమ్‌లు కూడా పోటెత్తుతున్నాయి. దీంతో ఓ ట్విట్టర్ యూజర్ మరింత హాస్యభరిత ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లో ఎంటర్‌టైన్ ఆగదు.. కొనసాగుతూనే ఉంటుంది అంటూ పేర్కొన్నాడు. ఈ కొత్త పీఎం షాబాజ్ షరీఫ్ చేతులు ఎంత వేగంగా కదులుతాయో ఓ సారి చూడండి అంటూ రాసుకొచ్చాడు.

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆదివారం రాత్రి చర్చలు కీలక మలుపు తిరిగాయి. సుమారు 12 గంటలపాటు చర్చలు జరిగాయి. చివరకు ఇమ్రాన్ ఖాన్ సోమవారం తన రాజీనామా ప్రకటించారు. దేశాన్ని దోచుకున్న దొంగలతో కలిసి తాను నేషనల్ అసెంబ్లీలో కూర్చోనని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత ప్రతిపక్షాల్లో జోష్ కనిపించింది. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి అసెంబ్లీకి వచ్చాయి. పాకిస్తాన్ ప్రధానిగా మూడు సార్లు బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ రోజు రాత్రే పీఎంఎల్ఎన్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణం తీసుకోబోతున్నట్టు తెలిసింది.

 

పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి కోసం ప్రతిపక్షాల ఓటింగ్ సమయంలో తాము నేషనల్ అసెంబ్లీలో కూర్చునేది లేదని పీటీఐ అధినేత, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఈ ఓటింగ్‌కు ముందే స్పష్టం చేశారు. కొత్త ప్రధాని ఎన్నికను తాము బహిష్కరిస్తున్నామని తెలిపారు. అందుకే తాము అందరం పార్లమెంటు నుంచి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దొంగలతో తాను నేషనల్ అసెంబ్లీలో కూర్చోబోనని అన్నారు. అనంతరం, పాకిస్తాన్ నూతన ప్రధాని కోసం ఎన్నిక జరిగింది. అందులో పీఎంఎల్ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో షాబాజ్ షరీఫ్ 174 ఓట్లు గెలుచుకున్నారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మొత్తం బలం 342. దీంతో ఆయన మెజార్టీ ఓట్లు పొందారు. ఆయన పాకిస్తాన్ 23వ ప్రధానిగా ఎన్నికయ్యారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే