
PM Modi: పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. షరీఫ్‌ను అభినందిస్తూ.. భారత్.. ఉగ్రవాదం లేని శాంతి యుత, సుస్థిర అభివృద్దిని కోరుకుంటుందని తెలిపారు. దేశం అభివృద్ధి చెందే క్రమంలో రాబోయే సవాళ్లలను ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎల్లప్పులు ప్రజలు శ్రేయస్సు కోసమే పాటుపడుతుందని ప్రధాని మోడీ అన్నారు.
పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన జనరల్ అసెంబ్లీ అవిశ్వాస ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ ఓటమిపాలయ్యారు. ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 174 ఓట్లు రావడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది.
ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ.. ప్రధానమంత్రి పదవికి షరీఫ్ అభ్యర్థిత్వాన్ని సూచించింది. అతని అభ్యర్థ్యాన్ని ప్రతిపక్షాలు బలపరచడంతో 23వ ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌ను ఎన్నికయ్యాడు. మూడు సార్లు పాక్ కు ప్రధానిగా పనిచేసిన నవాబ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ ఖాన్. ఆయనపై గతంలో మనీలాండరీంగ్ విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రధానిగా ఎన్నికైన తర్వాత షెహబాజ్ షరీఫ్ భారత్- పాక్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. కానీ ఆర్టికల్ 370 రద్దును పూర్తిగా వ్యతిరేకించారు. భారత్‌తో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నానని.. అయితే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం లేకుండా అది జరగదన్నారు. ఆర్టికల్ 370ను రద్దు బలవంతంగా జరిగిందనీ, ఈ సమయంలో దౌత్యం కోసం ఎన్నో ప్రయత్నించామని పేర్కొన్నారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు పాకిస్థాన్ రాజకీయంగా, దౌత్యపరంగా కశ్మీర్ ప్రజలకు నైతిక మద్దతు ఇస్తుందన్నారు. సమస్యపై ప్రతి అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ సమస్యను లేవనెత్తుతామన్నారు. ఆ తర్వాత పేదరికంపై కలిసి పోరాటం చేద్దామని మోదీని ఆహ్వానిస్తానని షరిఫ్ పేర్కొన్నారు. అయితే.. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ అనేది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని తేల్చి చెప్పారు.