భారత్‌ కోసం ఒక్కటవుతున్న అంతర్జాతీయ సమాజం.. రంగంలోకి ఈయూ, జర్మనీ

By Siva KodatiFirst Published Apr 25, 2021, 9:47 PM IST
Highlights

కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది. ఇండియాకు అవసరమైన సాయం చేయడానికి అడుగులు వేస్తున్నాయి

కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది. ఇండియాకు అవసరమైన సాయం చేయడానికి అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌, జర్మనీ తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.

భారత్‌ విజ్ఞప్తి మేరకు కావాల్సిన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అత్యసవరంగా కావాల్సిన ఆక్సిజన్‌, ఔషధాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

ఈ మేరకు ఇప్పటికే ఐరోపా సమాఖ్య సభ్య దేశాల నుంచి వస్తు సామాగ్రిని సేకరించడం ప్రారంభించామని ఈయూ అధ్యక్షుడు ఉర్సులా వెల్లడించారు. క్లిష్ట పరిస్ధితుల్లో తామంతా భారత్ వెన్నంటి వుంటామని ప్రకటించారు. 

Also Read:ఇండియాలో ఆగని కరోనా ఉధృతి: 24 గంటల వ్యవధిలో 3.49 లక్షల కేసులు, రికార్డుస్థాయిలో మరణాలు

మరోవైపు భారత్‌లో పరిస్థితిపై జర్మనీ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొవిడ్‌తో పోరాడుతున్న భారత ప్రజల పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు. అయితే, ఎలాంటి సాయం అందించనున్నారో ప్రకటించనప్పటికీ.. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్‌ అందించేందుకు జర్మనీ సైన్యం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇజ్రాయెల్ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. భారత్‌కు సాయం అందించేందుకు అక్కడి ఇప్పటికే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, చైనా, పాకిస్థాన్‌.. భారత్‌‌కు సాయం చేసందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

click me!