కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

Published : Apr 25, 2021, 10:58 AM IST
కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

సారాంశం

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఆదివారం నాడు  ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో  15 మంది రోగులు మరణించారు.   

న్యూఢిల్లీ: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఆదివారం నాడు  ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో  15 మంది రోగులు మరణించారు. బాగ్దాద్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎందరు బాధితులున్నారనే విషయమై ఇంకా స్పష్టంగా తెలియదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఈ బహుళ అంతస్తుల భవనంలో ఆదివారం నాడు తెల్లవారుజామున  మంటలు వ్యాపించినట్టుగా  ఆసుపత్రివర్గాలు తెలిపాయి.ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ప్రమాదం జరిగిన సమయంలో  ఆసుపత్రిలో ఉన్న 120మందిలో 90 మందిని రక్షించారు. 

ఆసుపత్రిలో కరోనా రోగులకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్ పేలుడు వాటిల్లిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.ఇరాక్ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ  కనీసం 8 వేల  కరోనా కేసులు నమోదౌతున్నాయి. ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !