లంకలో వెలుగులోకి కొత్త స్ట్రెయిన్: గంట వరకు గాల్లోనే, అత్యంత ప్రమాదకారి అంటున్న నిపుణులు

Siva Kodati |  
Published : Apr 25, 2021, 02:37 PM IST
లంకలో వెలుగులోకి కొత్త స్ట్రెయిన్: గంట వరకు గాల్లోనే, అత్యంత ప్రమాదకారి అంటున్న నిపుణులు

సారాంశం

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తోందో  ప్రపంచం చూస్తోంది. అయితే మనదేశంతో పాటు పలు దేశాల్లోనూ కొత్త  స్ట్రెయిన్‌లు వెలుగులోకి వస్తున్నాయి. తొలి దశ కోవిడ్ కంటే ఈ మ్యూటేషన్లు ఎన్నో రెట్లు ప్రమాదకరమమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

తాజాగా శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్‌ను) గుర్తించారు. ఇది లంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

Also Read:బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోనక్కరలేదు.. ఎక్కడంటే

గంట వరకు ఈ వైరస్‌ గాలిలో ఉంటోందని నిర్ధారించారు. శ్రీలంకలో గత వారం జరిగిన నూతన సంవత్సరం వేడుకల తర్వాత నుంచి కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపారు. ముఖ్యంగా యువత ఎక్కువగా దాని బారిన పడుతున్నారు.

వచ్చే 2 వారాల్లో కరోనా మూడో దశ ఉద్ధృతికి దారితీయవచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుంపర్లలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ గంట వరకు గాలిలో ఉంటున్నదని గుర్తించామని శ్రీలంక ఇమ్యునాలజీ, మాలిక్యులర్‌ సైన్సెస్‌ విభాగం చీఫ్‌ . ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి శ్రీలంక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !