ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల కోవిడ్ మరణాలు.. యూరోప్ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

By Siva KodatiFirst Published Nov 4, 2021, 6:07 PM IST
Highlights

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా యూరప్‌లో మరో 5 లక్షల కోవిడ్ మరణాలు సంభవించే ప్రమాదముందని గురువారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.

2019 చివరిలో చైనాలో (china) పుట్టిన కరోనా (coronavirus)మహమ్మారి ఇంకా తన  ప్రతాపం చూపుతూనే  వుంది. కొత్త కొత్త వేరియెంట్ల రూపంలో వైద్య శాస్త్రానికి సవాల్ విసురుతోంది. ప్రస్తుతం రష్యా (russia) చైనా, అమెరికా (america), బ్రిటన్ (britain) , ఇటలీ (italy) తదితర దేశాల్లో కోవిడ్  కొత్త రకం వణికిస్తోంది. ఇక అన్నింటికి మించి గత కొన్ని రోజులుగా యూరప్‌లో (europe) కోవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా యూరప్‌లో మరో 5 లక్షల కోవిడ్ మరణాలు సంభవించే ప్రమాదముందని గురువారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.

ALso Read:చైనాలో మళ్లీ కరోనా ఆంక్షల పర్వం.. 11 ప్రావిన్సుల్లో కేసుల పెరుగుదల

డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లూగే ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ…”యూరోపియన్ ప్రాంతంలోని 53 దేశాలలో ప్రస్తుతం వైరస్ ప్రసార వేగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఒక అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి యూరప్‌లో మరో 5 లక్షల COVID-19 మరణాలు నమోదయ్యే అవకాశముంది అని అన్నారు. WHO లెక్కలో యూరోపియన్ ప్రాంతం…మధ్య ఆసియాలోని కొన్ని దేశాలతో కూడా కలిపి 53 దేశాలు మరియు భూభాగాలకు విస్తరించింది.

ఇక, కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 50 లక్షలు దాటగా.. 50 శాతం మరణాలు అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్​, బ్రెజిల్​ దేశాల నుంచే నమోదయ్యాయి. మరోవైపు.. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడం వల్లనే రష్యా, ఉక్రెయిన్, తూర్పు ఐరోపాలోని పలు ప్రాంతాల్లో వైరస్ ఈ స్థాయిలో విజృంభిస్తోందని నిపుణులు అంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్​లో భాగంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నా.. పేద దేశాల్లోని ప్రజలకు మాత్రం ఇంకా ఒక్క డోసు టీకా కూడా అందలేదు. 130 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికాలో కేవలం 5 శాతం మందే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు.

click me!