భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్: శ్రీనగర్ - షార్జా విమానాలకు గగనతలం నిరాకరణ

By Siva KodatiFirst Published Nov 4, 2021, 4:20 PM IST
Highlights

జమ్మూకశ్మీర్‌లోని (jammu kashmir) శ్రీనగర్‌ను (srinagar), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని (uae) షార్జా నగరాన్ని (sharjah) కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్‌’ (go firsr air lines) ఎయిర్‌లైన్స్ విమానాలను తమ గగనతలం (airspace) మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్‌ మంగళవారం స్పష్టం చేసింది

పాకిస్తాన్ (pakistan).. భారత్ (india) పట్ల మరోసారి అక్కసు వెళ్లగక్కింది. జమ్మూకశ్మీర్‌లోని (jammu kashmir) శ్రీనగర్‌ను (srinagar), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని (uae) షార్జా నగరాన్ని (sharjah) కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్‌’ (go firsr air lines) ఎయిర్‌లైన్స్ విమానాలను తమ గగనతలం (airspace) మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్‌ మంగళవారం స్పష్టం చేసింది. గతంలో గోఎయిర్‌గా పిలవబడిన గో ఫస్ట్‌ పౌర విమానయాన సంస్థ ఈ ఏడాది అక్టోబర్‌ 23 నుంచి శ్రీనగర్‌–షార్జా నగరాల మధ్య డైరెక్ట్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలుపుతూ ప్రయాణించే విమానాలు పాకిస్తాన్‌ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది.

Also Read:బాలాకోట్‌ దాడుల హీరోకు ప్రమోషన్.. ఇక గ్రూప్ కెప్టెన్‌గా అభినందన్ వర్థమాన్

అక్టోబర్‌ 31వ తేదీ వరకు ఆ విమానాలన్నీ ఎలాంటి అటంకాలు లేకుండా పాక్‌ మీదుగా రాకపోకలు సాగించాయి. అయితే తాజాగా తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్‌ తేల్చి చెప్పేసింది. దీంతో మంగళవారం శ్రీనగర్‌ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. దీంతో విమానం మరో 40 నిమిషాలపాటు అదనంగా ప్రయాణించాల్సి వచ్చింది. ఇందుకు గల కారణాలను పాకిస్తాన్‌ ఇంతవరకు భారత్‌కు తెలియజేయలేదు. దీనిపై గో ఫస్ట్‌ సంస్థ సైతం ఎలాంటి స్పందన రాలేదు.

కాగా.. అక్టోబర్ 23న, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah) శ్రీనగర్‌లోని షేక్ ఉల్-ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీనగర్-షార్జా సర్వీసును ప్రారంభించారు. 11 ఏళ్ల తర్వాత కశ్మీర్- యుఏఈ మధ్య నేరుగా విమాన సర్వీసుల్ని పునరుద్ధరించారు. పాకిస్తాన్ తాజా నిర్ణయంపై కశ్మీర్లోని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇది చాలా దురదృష్టకరమైన చర్య అని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (omar abdullah) ట్వీట్ చేశారు. 2009-2010లో శ్రీనగర్ నుంచి దుబాయ్‌కి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం విషయంలోనూ పాకిస్తాన్ ఇలాగే వ్యవహరించిందని అబ్దుల్లా గుర్తు చేశారు. తమ గగనతలంపై ప్రయాణించడానికి గో ఫస్ట్‌ ఎయిర్ వేస్‌కు పాకిస్తాన్ అనుమతి ఇస్తుందని ఆయన ఆకాంక్షించారు. మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ (mehabooba mufti) కూడా పాకిస్తాన్ తీరును తప్పుబట్టారు. కేంద్రం ఈ విషయంలో కల్పించుకోవాలని ఆమె కోరారు. 
 

click me!