నేపాల్‌లో హెలికాప్టర్ మిస్సింగ్.. అందులో ఐదుగురు విదేశీయులు..!!

Published : Jul 11, 2023, 12:03 PM ISTUpdated : Jul 11, 2023, 12:10 PM IST
నేపాల్‌లో హెలికాప్టర్ మిస్సింగ్.. అందులో ఐదుగురు విదేశీయులు..!!

సారాంశం

నేపాల్‌లో  ఓ హెలికాప్టర్ మిస్సింగ్ అయింది. ఆ హెలికాప్టర్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు.

నేపాల్‌లో  ఓ హెలికాప్టర్ మిస్సింగ్ అయింది. ఆ హెలికాప్టర్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు.  కనిపించిపోయిన హెలికాప్టర్ మనంగ్ ఎయిర్ సంస్థకు చెంది. అది సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ఈ హెలికాప్టర్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో డిస్‌కనెక్ట్ అయిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం హెలికాప్టర్‌తో కాంటాక్ట్ నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సోలుకుంబులోని సుర్కి నుంచి ఖాట్మాండ్‌కు మంగళవారం ఉదయం 9:45 గంటలకు హెలికాప్టర్ బయలుదేరిందని నేపాల్ పౌర విమానయాన అథారిటీ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్ ప్రతాప్ బాబు తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. 9N-AMV అనే కాల్ సైన్ ఉన్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకు గ్రౌండ్‌తో కాంటాక్ట్ కోల్పోయింది. ఈ మేరకు ఖాట్మాండ్ పోస్టు రిపోర్ట్ చేసింది ఇక, కనిపించుకుండా పోయిన హెలికాప్టర్‌లోని ఆరుగురిలో.. కెప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ కూడా ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?
దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ