ఎమిరెట్స్ ఫ్లైట్ 13 గంటలు ప్రయాణించి.. టేకాఫ్ అయిన చోటే ల్యాండ్ అయింది.. అసలేం జరిగిందంటే?

Published : Jan 30, 2023, 05:42 PM ISTUpdated : Jan 30, 2023, 06:10 PM IST
ఎమిరెట్స్ ఫ్లైట్ 13 గంటలు ప్రయాణించి.. టేకాఫ్ అయిన చోటే ల్యాండ్ అయింది.. అసలేం జరిగిందంటే?

సారాంశం

ఎమిరెట్స్ ఫ్లైట్ 13 గంటలు గాల్లో ప్రయాణించి ఎక్కడైతే టేకాఫ్ అయిందో మళ్లీ అక్కడే ల్యాండ్ అయింది. దుబాయ్ నుంచి న్యూజిలాండ్‌కు బయల్దేరిన విమానం దాని గమ్యస్థానాన్ని చేరలేకపోయింది. ఆక్లాండ్ ఎయిర్ పోర్టు వరదల్లో మునిగిపోవడంతో ఆ విమానం యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది.  

న్యూఢిల్లీ: ఎమిరెట్స్ ఫ్లైట్ 13 గంటలు గాలిలో ప్రయాణించింది. దుబాయ్ నుంచి న్యూజిలాండ్‌‌కు బయల్దేరిన విమానం 13 గంటలు ప్రయాణించింది. తిరిగి మళ్లీ టేకాఫ్ అయిన చోటే ల్యాండ్ అయింది. ఈ అనూహ్య ఘటనను ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

దుబాయ్ నుంచి ఈకే448 విమానం ఉదయం 10.30 గంటలకు టేకాఫ్ అయింది. 9 వేల మైళ్ల ట్రిప్పులో ఆ విమానం సగం దూరం వెళ్లిన తర్వాత పైలట్ యూటర్న్ తీసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత మళ్లీ ఆ ఫ్లైట్ దుబాయ్‌లోనే ల్యాండ్ అయింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ ఎయిర్‌పోర్టులో వరదలు పోటెత్తాయి. దీంతో ఆక్లాండ్ ఎయిర్‌పోర్టును మూసేశారు. ఫలితంగా దుబాయ్ నుంచి బయల్దేరిన ఎమిరేట్స్ విమానం వెనక్కి రాక తప్పలేదు.

Also Read: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య .. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఇది ఫ్రస్ట్రేటింగ్‌గా ఉన్నదని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. కానీ, ప్రయాణికుల భద్రత తమకు ప్రధానమని వివరించారు. తమ ఇంటర్నేషనల్ టర్మినల్‌కు జరిగిన నష్టాన్ని అధికారులు ఇప్పుడే అంచనా వేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ విమానాలు 28వ తేదీన తాము ఆపరేట్ చేయలేమని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ.. ప్రయాణికుల భద్రతమే తమకు ముఖ్యమని వివరించారు. ఆదివారం అంటే జనవరి 29వ తేదీన ఉదయం 7 గంటల వరకు ఆక్లాండ్ ఎయిర్‌పోర్టులో ఇంటర్నేషనల్ ప్రయాణికులను స్వాగతించలేమని పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రయాణికులు తాము సురక్షితమే అని సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇంకొందరు మాత్రం టైమ్ వేస్ట్ అయిందని అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే