మ‌సీదులో బాంబు పేలుడు.. 28 మంది మృతి, 150 మందికి తీవ్ర గాయాలు

By Mahesh RajamoniFirst Published Jan 30, 2023, 5:20 PM IST
Highlights

Islamabad: పాకిస్థాన్ లోని పెషావర్‌ మసీదులో సోమవారం జరిగిన బాంబు పేలుడులో 28 మంది మరణించారు. అలాగే, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. జుహర్ ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో నగరంలోని పోలీస్ లైన్స్ ఏరియా సమీపంలో పేలుడు సంభవించిందని అక్క‌డి అధికార వ‌ర్గాలు తెలిపాయి. 

Bomb blast at Peshawar mosque 28 dead: జుహర్ ప్రార్థనల అనంతరం మ‌సీదులో చోటుచేసుకున్న బాంబు పెలుడులో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 150 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో చాలా మంది ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతున్నారు. ప‌లువురి ప‌ర‌స్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ  పేలుడు పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. పాకిస్థాన్ లోని ఉత్తర నగరమైన పెషావర్ లోని ఓ మసీదులో సోమవారం జరిగిన పేలుడులో 28 మంది మృతి చెందగా, 150 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి కారణంగానే పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పెషావర్ లోని పోలీస్ లైన్స్ ప్రాంతానికి సమీపంలో మధ్యాహ్నం 1:40 గంటల ప్రాంతంలో ప్రార్థనల సమయంలో ఈ ఘోర పేలుడు సంభవించింది. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మసీదు లోపలి నుంచి తీసిన వీడియోలో నేలపై శిథిలాలు కనిపించాయి. పేలుడు ధాటికి మసీదులో ఒక వైపు కూలిపోయింది.

పెషావర్ మసీదు పేలుడు గురించి ప్ర‌స్తుత వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

  • ప్రార్థనల సందర్భంగా మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడని జియో న్యూస్ తెలిపింది. ప్రార్థనల సమయంలో ముందు వరుసలో ఉన్న ఆత్మాహుతి దాడిదారుడు తనను తాను పేల్చుకున్నాడని భద్రతా అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
  • జుహర్ ప్రార్థనల అనంతరం మ‌సీదులో చోటుచేసుకున్న బాంబు పెలుడులో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 150 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 
  • క్షతగాత్రులను పెషావర్ లోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుండటంతో రక్తదానం చేయాలని పెషావర్ గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు దునియా న్యూస్ తెలిపింది.
  • ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించామని, ఆ ప్రాంతాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఎమ‌ర్జెన్సీ బృందాలతో చుట్టుముట్టామని, నగరంలోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ విధించామని, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పెషావర్ కమిషనర్ రియాజ్ మెహసూద్ తెలిపారు.
  • జుహర్ ప్రార్థనల అనంతరం పెషావ‌ర్ మ‌సీదులో చోటుచేసుకున్న బాంబు పెలుడులో 28 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంద‌నే రిపోర్టుల మ‌ధ్య ఇస్లామాబాద్ పోలీసులు అప్ర‌మ‌త్త‌మై భద్రతా హై అలర్ట్ ప్రకటించారు.
  • ఈ పేలుడును పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. మసీదు లోపల పేలుడుకు కారణమైన దుండగులకు ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
  • పాకిస్థాన్ ను రక్షించే కర్తవ్యాన్ని నిర్వర్తించే వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భయాందోళనలు సృష్టించాలనుకుంటున్నారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
  • పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ సేకరణను మెరుగుపరచాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
     
click me!