Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 20 మంది మృతి

Published : Aug 10, 2026, 09:25 PM IST
Earthquake

సారాంశం

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ భూకంపం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది.

Earthquake : దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా 20 మంది మరణించినట్లు… వేలాదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా క్షతగాత్రులు చిక్కుకుని ఉండే అవకాశాలున్నాయి… కాబట్టి మరణాల సంఖ్య పెరగవచ్చిన అంతర్జాతీయ మీడియా పేర్కొంటొంది.

వెనిజులా, ఈక్వెడార్ లోనూ కంపించిన భూమి

ఈ భూకంపం వల్ల కొలంబియాలోని చోకో ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం జరిగింది. ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది. రాజధాని బోగోటాలోనూ భూమి కంపించింది… కానీ ఇక్కడ తీవ్రత అంతగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్క దేశాలైన వెనిజులా, ఈక్వెడార్‌లలో కూడా ప్రకంపనలు వచ్చాయి.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 గంటలకు ఈ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే, కొలంబియా జియోలాజికల్ సర్వీస్ రెండూ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 7.4గా నిర్ధారించాయి. సాన్ జోస్ డెల్ పామర్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ కొలంబియాలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని సిటీ మేయర్ ధృవీకరించారు. కాలి నగరంలో 20 భవనాలు కూలిపోయాయని, శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారని మేయర్ తెలిపారు.

నిలిచిన విమాన సర్వీసులు

పెరీరా, మణిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనావెంచురా నగరాల్లోని విమానాశ్రయాలు కూడా దెబ్బతిన్నాయని కొలంబియా ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?