Monkeypox: మంకీ పాక్స్ పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..

Published : May 12, 2023, 07:04 AM IST
Monkeypox: మంకీ పాక్స్ పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..

సారాంశం

Monkeypox: మంకీ పాక్స్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఓ కీలక అప్డేట్ విడుదల చేసింది. MPOX ఇకపై ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదని చెప్పబడింది. దీనికి సంబంధించి WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..  "Mpox (మంకీ పాక్స్) ఇకపై ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదు" అని ప్రకటించారు.

Monkeypox: కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలను అంతగా భయపెట్టిన వ్యాధి మంకీపాక్స్. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వేల మందికి వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) జూలై 2022లో ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది .

అయితే.. ఇటీవల ఈ వ్యాధి వ్యాప్తిలో తగ్గుదల కనిపించడం. గత కొన్ని వారాలుగా తక్కువ సంఖ్యలో నమోదు కావడంతో తాజాగా ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మంకీపాక్స్ (mpox) వ్యాధి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రకటించారు. 

అదుపులో మంకీపాక్స్ 

WHO అత్యవసర కమిటీ సిఫార్సు ఆధారంగా వ్యాధికి సంబంధించిన అత్యవసర పరిస్థితిని ముగించినట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రకటించారు. Monkeypox ఇప్పుడు నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 87,000 కంటే ఎక్కువ MPOX కేసులు నిర్ధారించబడ్డాయి. గత మూడు నెలల్లో గత ఏడాది కంటే 90 శాతం తక్కువ Mpox కేసులు నమోదయ్యాయని WHO చీఫ్ చెప్పారు. కొత్త WHO నివేదిక ప్రకారం.. 2022 ప్రారంభం నుండి మే 8, 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా 87,000 కంటే ఎక్కువ Mepox కేసులు నిర్ధారించబడ్డాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితం కోవిడ్-19 మహమ్మారిపై కూడా అత్యవసర పరిస్థితిని తొలిగించిన విషయం తెలిసిందే. "మశూచి,COVID-19 రెండింటి యొక్క అత్యవసర పరిస్థితులు ముగిసినప్పటికీ, ముప్పు మిగిలి ఉందని తెలిపారు. ఈ రెండు వైరస్‌ల వ్యాప్తి వల్ల మరణాలు సంభవించే ప్రమాదముందని తెలిపారు.  

ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. గతేడాది మే నెలలో బ్రిటన్ లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు యూరప్ లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. అమెరికా, యూరప్ దేశాల్లోనే ఈ వ్యాధికి సంబంధించిన ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. బ్రిటన్ తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోనూ అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..