మా జోలికి వస్తే ఎవరికీ మంచిది కాదు.. అమెరికాకు ముఖంపైనే చెప్పేసిన తాలిబాన్లు

By telugu teamFirst Published Oct 10, 2021, 5:47 PM IST
Highlights

తాలిబాన్లు మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. తమతో సత్సంబంధాలు కలిగి ఉంటేనే అందరికీ మంచిదని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తే ఎవరికీ మంచిది కాదని, అది ప్రజలకు సమస్యలను కొనితెస్తాయని హెచ్చరించారు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పాటు చేసిన తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించవద్దని తాలిబాన్లు హెచ్చరించారు. అలా చేస్తే ఎవరికీ అంత మంచిది కాదని americaకు ముఖంపైనే చెప్పేశారు. talibanలు ఈ ఏడాదిలో మరోసారి afghanistan ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 20ఏళ్ల తర్వాత అమెరికా సేనలు వెనుదిరగడం, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సైన్యం బలహీనంగా ఉండటంతో తాలిబాన్లు సులువుగా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తొలిసారిగా అమెరికాతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. దోహాలో తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖి అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో దోహాలో భేటీ అయ్యారు.

‘ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేయవద్దని మేం వారికి స్పష్టంగా చెప్పాం. అలా చేయడం ఎవరికీ మంచిది కాదన్నాం. ఆఫ్ఘనిస్తాన్‌తో సత్సంబంధాలు అందరికీ మంచిది. అంతేకానీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తే ప్రజలందరికీ సమస్యలు తప్పవు’ అని ఆమిర్ ఖాన్ ముత్తఖి హెచ్చరించారు.

Also Read: ఆఫ్ఘనిస్తాన్: షియాలే టార్గెట్ , మసీదులో బాంబు పేలుళ్లు.. భారీగా మృతులు..?

ఆఫ్ఘనిస్తాన్‌ పౌరులకూ కరోనాను నిలువరించే టీకాలు వేయాలని అమెరికాను కోరామని వివరించారు. అందుకు అమెరికా ప్రతినిధులూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. టీకా పంపిణీలో సహకరిస్తామని, హ్యూమన్ కోఆపరేషన్ కూడా చేస్తారని హామీనిచ్చినట్టు తెలిపారు.

click me!