పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు.. రెండు రోజులు అక్కడే.. పోలీసులు ఏం చేశారంటే?

By telugu teamFirst Published Oct 9, 2021, 12:33 PM IST
Highlights

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఇంటి పైకి వెళ్లి పక్కనే ఉన్న చెట్టు ఎక్కేశాడు. పోలీసులు వచ్చి ఆయనను కిందికి రావాల్సిందిగా అనేక ప్రయత్నాలు చేశారు. అయినా, రెండు రోజులు ఆయన పట్టువీడకుండా చెట్టుపైనే ఉన్నారు. చివరికి పాస్టర్ ద్వారా నచ్చజెప్పించడంతో శుక్రవారం చెట్టుదిగాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
 

న్యూఢిల్లీ: ఆయనకు policeలంటే విపరీతమైన భయం. ఇది వరకు jailకు వెళ్లిన ఆయన ఊచల వెనక పరిస్థితిని తలుచుకుంటూ అప్పుడప్పుడూ వణికిపోతుంటాడు. జైలులో తనను వేధించారని, మళ్లీ ఎట్టిపరిస్థితుల్లో కారాగారానికి వెళ్లవద్దని భావించాడు. కానీ, మరోసారి ఓ కేసులో చిక్కుకుని పోలీసుల కన్నులో పడాల్సి వచ్చింది. కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు ఇంటికి రాగానే.. ఆ వ్యక్తి ఇంటి పైకప్పు నుంచి పక్కనే ఉన్న ఓ treeపైకి ఎక్కాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి two days ఆ చెట్టు మీదే గడిపాడు. ఎట్టకేలకు శుక్రవారం పట్టు వీడి చెట్టు దిగాడు.

america బ్రూక్‌విలీలోని క్వీన్స్‌కు చెందిన రూడీ థామస్ తన తల్లిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తల్లి రూడీ థామస్‌పై పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. అంతే, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటిపైకి వెళ్లి చెట్టెక్కేశాడు. పోలీసులు ఇంటికి వచ్చి తెగ వెతికారు. చివరికి చెట్టుపై ఉన్నట్టు కనుగొన్నారు. కిందికి రావాల్సిందిగా థామస్‌ను అడిగారు. కానీ, ఆయన ససేమిరా అన్నాడు.

చెట్టుపై నుంచి థామస్‌ను దిగిపించడానికి పోలీసులు వివిధ మార్గాలను అనుసరించారు. సైరన్లు, droneలను వినియోగించారు. మధ్యవర్తులతోనూ నచ్చజెప్పించే ప్రయత్నం చేశారు. అయినా థామస్ చెట్టు దిగలేదు. దీంతో వీధిలోకి ప్రజలనందరిని రప్పించారు. పాస్టర్‌తో ఆయనకు హామీనిప్పించారు. పోలీసులు ఆయనను బాధించబోరని, ఆయన మానసిక ఆరోగ్యాన్ని కాపాడతామని pastorతో చెప్పించారు. అప్పుడు అంటే, శుక్రవారం థామస్ చెట్టుదిగాడు. పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

రూడీ థామస్‌పై తమకు ఓ ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 30న 50ఏళ్ల మహిళను కారులో దాడి చేశాడని ఫిర్యాదు ఉన్నట్టు వివరించారు. ఆయనపై వారంట్‌తోనే ఇంటికి వచ్చామని చెప్పారు. రూడీ థామస్ చెట్టు ఎక్కడం కొత్తేమీకాదని ఆయన ఇంటి ఇరుగుపొరుగు వారు అన్నారు.

click me!