రష్యాలో కుప్పకూలిన విమానం: 19 మంది మృతి

Published : Oct 10, 2021, 02:13 PM IST
రష్యాలో కుప్పకూలిన విమానం: 19 మంది మృతి

సారాంశం

రష్యాలో ఎల్-140 అనే తేలికపాటి విమానం కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ఈ విమానంలో ప్రయాణీస్తున్న 19 మంది మరణించారు.మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విమానంలో స్కై డైవింగ్ సభ్యులున్నారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మాస్కో: Russiaలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో  19 మంది మరణించారు.ఎల్-140 అనే తేలికపాటి flight కూలిపోయిందని అధికారులు తెలిపారు.  ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 23 మంది ఉన్నారు. ఆదివారం నాడు  రష్యా కాలమానం ప్రకారం ఉదయం 9:23 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొంది.

also read:ఫిలిఫ్పిన్స్‌లో కుప్పకూలిన మిలటరీ విమానం: 45 మంది మృతి

Tatarstan రిపబ్లిక్ మీదుగా  వెళ్తున్న సమయంలో ఫ్లైట్ కుప్పకూలిందని రష్యా అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదం నుండి  ముగ్గురిని రక్షించినట్టుగా రష్యా వారు తెలిపారు.ఈ ఫ్లైట్‌లో 20 మంది స్కై డైవింగ్ క్లబ్ సభ్యులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.  విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందని అధికారులు వివరించారు.

మెమెలిన్స్క్ పట్టణానికి సమీపంలో విమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు  విమానం రాడార్ల నుండి అదృశ్యమైంది. ఈ విమానం  ప్రమాదానికి గురైన సమయంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఫ్లైట్ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి చెందిన ఫోటోలను ఏవియేషన్ మినిస్ట్రీ విడుదల చేసింది. విమానం సగ భాగానికి విరిగిపోయాయని విమాన మంత్రిత్వశాఖ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..