వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. తక్షణం భవనాన్ని ఖాళీచేసిన ట్రంప్

By telugu news teamFirst Published Aug 11, 2020, 7:26 AM IST
Highlights

ఆపకుండా కాల్పుల శబ్దం వినపడుతూనే ఉంది. అక్కడి వారంతా ఆ శబ్దాలు విని భయంతో వణికిపోయారు. అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని వెంటనే ట్రంప్ కి తెలియజేసి,.. ఆయన చేత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. 

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికా ప్రెసిడెంట్ అధికార నివాసమైన వైట్ హౌస్ వద్ద కాల్పుల వర్షం కురిసింది. గుర్తు తెలియని వ్యక్తి అక్కడ బీభత్సం సృష్టించాడు. దీంతో.. అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. ఆ సమయంలో ట్రంప్ విలేకరుల సమావేశంలో ఉండటం గమనార్హం.

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ట్రంప్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. కరోనా వైరస్, చైనా చర్యలపై ఆయన మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. ఆపకుండా కాల్పుల శబ్దం వినపడుతూనే ఉంది. అక్కడి వారంతా ఆ శబ్దాలు విని భయంతో వణికిపోయారు. అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని వెంటనే ట్రంప్ కి తెలియజేసి,.. ఆయన చేత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. 

కాగా.. వైట్ హౌస్  వద్ద కాల్పులు జరిపిన వ్యక్తిపై పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. కాగా.. వీరు జరిపిన కాల్పుల్లో అతనికి బులెట్ గాయమైంది. అతనికి అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతను ఎవరు..? ఎందుకు అలా కాల్పులు జరిపాడు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!