ఇప్పటికే కరోనా విలయతాండవం.. మళ్లీ ఇంకో వ్యాధి: అమెరికాను వణికిస్తున్న ఉల్లిపాయ

By Siva KodatiFirst Published Aug 7, 2020, 4:47 PM IST
Highlights

ఉల్లి పేరు చెబితేనే అమెరికా భయపడిపోతోంది. ఉల్లిపాయల నుంచి సోకే భయంకరమైన సాల్మోనెల్లా వ్యాధి ప్రస్తుతం దేశాన్ని చుట్టేస్తోంది. క

మనం కూరల్లో వాడుకునే ఉల్లిపాయకు ఆగ్రహం వస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఉల్లి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఉల్లి పేరు చెబితేనే అమెరికా భయపడిపోతోంది. ఉల్లిపాయల నుంచి సోకే భయంకరమైన సాల్మోనెల్లా వ్యాధి ప్రస్తుతం దేశాన్ని చుట్టేస్తోంది. కరోనా వైరస్‌ను మించిన ప్రభావం దీని వల్ల ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.

సాల్మోనెల్లా వ్యాధి పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి గురించి అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

ఫుడ్ పాయిజన్ కలిగించే సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య అమెరికా, కెనడాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇప్పటి వరకు అమెరికాలోని 34 రాష్ట్రాల్లో 400 మంది ఈ బ్యాక్టీరియా బారినపడినట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యాధి కారణంగా డయేరియా జ్వరం, కడుపునొప్పి వంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సాల్మోనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవని వైద్య నిపుణులు చెబుతున్నారు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయని.. అవి కూడా 4 రోజుల నుంచి 7 రోజుల పాటు ఉంటాయని అంటున్నారు.

డయేరియా, జ్వరం, కడుపునొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే దీనికి ఓ చిట్కా సైతం ఉందట. వీలైనంత ఎక్కువగా నీటిని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చట. 
 

click me!