
Trump Munir lunch meme fest: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య గురువారం (జూన్ 19, 2025న) వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్‌లో లంచ్ భేటీ జరిగింది. దీనిపై ISPR (Inter Services Public Relations) విడుదల చేసిన అధికార ప్రకటనలో వాడిన కొన్ని పదాలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి.
ఎందుకంటే దీని కోసం ఏఐ ని ఉపయోగించారని నెటిజట్లు గుర్తించారు. దీంతో తన అధికారిక వివరాల ప్రకటన కోసం కూడా ఏఐ ని ఉపయోగించే దేశం ఏదైనా వుంది అంటే అది పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ తో పాకిస్తాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు.
ఈ ప్రకటనలో సుమారు 60% వాక్యాలు AI జనరేటెడ్ న్యూస్ డెమో లాంటివి ఉన్నాయి. దీంతో నెటిజట్లు పాక్, ట్రంప్, మునీర్ ను టార్గెట్ చేసి రోస్ట్ చేస్తున్నారు. ట్రంప్, మునీర్ విందును ప్రస్తావిస్తూ పాకిస్తాన్ లో ఒక్కరికైనా మంచి భోజనం దొరికిందంటూ సెటైర్లు వేస్తున్నారు.
ట్రంప్–మునీర్ భోజనంపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' (గతంలో ట్విట్టర్)లో ట్రోల్స్, మీమ్స్ పండుగ మొదలైంది. ముఖ్యంగా బిర్యానీ, బాలీవుడ్ చిత్రాల సీన్లతో కూడిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
“ట్రంప్ మునీర్‌కు ఉచిత భోజనం ఇస్తున్నాడు, పాకిస్థాన్ తర్వాత ఇరాన్‌ను ఇరుకున పెట్టేందుకేనా ! అనీ, ఇంకొక మీమ్ లో “3 ఇడియట్స్” చిత్రంలోని హీరోలు పళ్లెంలో బిర్యానీతో ఉన్న దృశ్యాన్ని వాడి, “ట్రంప్-మునీర్ లంజ్ మొదటి విజువల్స్ వచ్చాయి” అని కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ క్లాసిక్స్‌తో వ్యంగ్యంతో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. అమ్రీష్ పూరి నటించిన 'రిష్టే' చిత్రం నుండి సీన్‌ను ఎడిట్ చేసి, ట్రంప్ మునీర్‌కు కేక్ తినిపిస్తున్నట్లు మార్చారు.
“ఇలాంటి కేక్ నీవు జీవితంలో చూసింది లేదు… నీవు తాగని లిక్కర్ ఇది… తిను తిను! ఇదిగో తాడు తాగు” అని క్యాప్షన్ తో ట్రోలర్స్ ఆటాడుకుంటున్నారు. ఇంకొక ట్వీట్‌లో, 2007లో వచ్చిన "చైన్ కులీ కి మైన్ కులీ" సినిమాకు చెందిన చిన్నారిని చూపిస్తూ, “అసిం మునీర్ వైట్ హౌస్‌లో ఉన్నాడు” అని రాశారు.
ISPR ప్రకారం, ఒక గంటపాటు మాత్రమే జరగాల్సిన భోజనం రెండు గంటలకు మించి కొనసాగింది. ఇది “డెప్త్ అండ్ కోర్డియాలిటీ ఆఫ్ ది డైలాగ్” అని ప్రకటించింది. ట్రంప్ మునీర్ పై ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్ శాంతి, స్థిరత్వంపై కొనసాగుతున్న యత్నాలను ప్రశంసించారు. ఇందులో మునీర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అయితే, దీనిపై ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఏర్పడిన యుద్ధ పరిస్థితిపై ట్రంప్ తరచూ “నేనే శాంతి తీసుకువచ్చాను, యుద్ధం ఆపాను” అంటూ కామెంట్స్ చేయడం చూస్తున్నాం. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా “వారిద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వారు యుధ్దం చేడానికి ముందుకు సాగలేదు. ఇద్దరు స్మార్ట్ వ్యక్తులు డిసైడ్ చేశారు యుద్ధం చేయకూడదని, అది అణుయుద్ధం కావచ్చు” అని అన్నారు. ఇక్కడ ట్రంప్ మోడీ, మునీర్ ఇద్దర్నీ ట్రిబ్యూట్ చేశారు. రెండు దేశాలను సమానంగా చూస్తూనే ఐ లవ్ పాక్ అని ట్రంప్ చెప్పడం.. అమెరికా-భారత్-పాకిస్థాన్ మధ్య వ్యూహాత్మక ప్రభావాన్ని చర్చలోకి తెచ్చింది.
ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి G7 సమావేశంలో ఉన్నప్పుడు స్పందిస్తూ.. “ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత-అమెరికా ట్రేడ్ డీల్ లేదా మూడవ పార్టీ మిడియేషన్ గురించి చర్చ జరగలేదని” తెలిపారు. అలాగే, ప్రధాని మోడీ ఫోన్ కాల్ లో ట్రంప్ కు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా, పాకిస్థాన్ మునీర్‌కు వైట్ హౌస్‌లో ఏర్పాటైన లంచ్ భేటీపై పాక్ లో విమర్శలు వస్తున్నాయి. ఐఎంఎస్ డిఫాల్ట్ ను పాక్ ఎదుర్కొంటూ ఉండగా, ఆర్థిక సంక్షోభం, బలోచ్, సింధూ ప్రాంతాల్లో అసంతృప్తులు పెరగడం, ఆర్మీలో అంతర్గత అసంతృప్తి వంటి విషయాలు చర్చకు దారితీశాయి.
ట్రంప్, మునీర్ భేటీపై సోషల్ మీడియాలో మీమ్స్ తుఫాను మొదలైంది. పాకిస్థాన్ ఏఐ జనరేటెడ్ ప్రకటనతో ట్రోలింగ్ మరింత పెరిగింది. హాస్య, వ్యంగ్యంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.