ఆహారం పెట్టడానికి వచ్చిన మహిళ మీద కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి..

By SumaBala BukkaFirst Published Mar 20, 2023, 10:59 AM IST
Highlights

రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా తన కూతురిని కుక్కలు కరిచాయని మృతురాలు క్రిస్టిన్ పోటర్ తండ్రి బిల్ కీఫర్ తెలిపారు.

అమెరికా : పక్కింటి కుక్కలకు ఆహారం పెట్టడానికి వెళ్లి.. వాటి దాడిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన అమెరికాలో కలకలం రేపింది. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది.  క్రిస్టిన్ పోటర్ (38) అనే మహిళ పొరుగింట్లో చాలా కుక్కలు ఉన్నాయి. వాటి యజమాని ఊరికి వెడుతూ.. వాటికి ఆహారం అందించమని సహాయం కోరడంతో క్రిస్టిన్ సరే అంది. గురువారం నాడు తన కొడుకుతో కలిసి ఆ కుక్కలకు ఆహారం పెట్టడానికి వెళ్లింది. ఆ సమయంలో రెండు గ్రేట్ డేన్‌ జాతి రకం కుక్కలు ఆమె మీద దాడి చేశాయి.

విషయం తెలిసి, పోలీసులు, సహాయకసిబ్బంది అక్కడికి చేరుకునే సరికే ఆమె మృతి చెందింది. వెటర్నరీ సిబ్బంది వచ్చి ఆ కుక్కలకు మత్తుమందు ఇచ్చిన తరువాత కానీ.. వారు ఆ ప్రాంతంలో అడుగు పెట్టలేకపోయారు. పెర్రీ కౌంటీ కరోనర్ రాబర్ట్ రెస్స్లర్ మాట్లాడుతూ,  పాటర్ ఇంతకు ముందు కూడా కుక్కలకు ఆహారం పెట్టిందని తెలిపారు. ఆమె తన చిన్న కొడుకుతో తన పొరుగువారి ఇంటికి వెళ్లిందని, చివరికి రెండు గ్రేట్ డేన్‌లు అతని తల్లిపై దాడి చేయడంతో సహాయం కోసం పరిగెత్తాడని అన్నారు. 

వయసు 28.. సంతానం 9... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికా మహిళ...

"అతను ఆ సమయంలో అక్కడే ఉన్నాడు, కానీ, దాడి సమయంలో  అతను అక్కడ ఉన్నాడని నేను అనుకోను" అని రెస్లర్  చెప్పారు. "కుక్కలు తన తల్లిపై దాడి చేయడాన్ని చూసిన వెంటనే, అతను తన సోదరుడితో 911కి కాల్ చేయించడానికి రోడ్డు మీదికి పరిగెత్తాడు" అని అధికారి తెలిపారు. మరో గ్రేట్ డేన్‌, ఫ్రెంచ్ బుల్ డాగ్ కూడా ఇంట్లో ఉన్నాయని, అయితే.. అవి దాడి చేయలేదని పోలీసులు చెప్పారు. క్రిస్టిన్ పోటర్ ను చంపిన రెండు గ్రేట్ డేన్‌లు తరువాత వెటర్నరీ డాక్టర్లతో చికిత్సి పశువైద్యునిచే మెర్సీ కిల్లింగ్ చేయించారని తెలిసింది.

క్రిస్టిన్ పోటర్ సోదరితో నిశ్చితార్థం అయిన బ్రాండన్ జైడర్స్ మాట్లాడుతూ.. ఆ రెండు గ్రేట్ డేన్‌లు ఆ సమయంలో ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటుండవచ్చని.. రాష్ట్ర పోలీసులు తనకు చెప్పారని, ఆ సమయంలో క్రిస్టిన్ పోటర్ జోక్యం చేసుకోవడంతో అవి ఆమె మీద తిరగబడ్డాయని తెలిపారు. ఇక ఆ కుక్కల యజమాని వెండి సబాత్నే  ఈ విషయం తెలిసి షాక్ అయ్యానని తెలిపారు. మా అమ్మ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంది. నేను అక్కడినుంచే మాట్లాడుతున్నానని ఆమె చెప్పారు. ‘ఇది చాలా దారుణమైన విషయం.. నా పెంపుడు జంతువులు అలా చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. జరిగింది నమ్మలేకపోతున్నాను. నేను చనిపోవాలనుకుంటున్నాను" అని ఆమె చెప్పింది.

అయితే, ఈ కుక్కలు ఇలా దాడి చేయడం ఇది మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే దూకుడుగా వ్యవహరించాయని వారు చెబుతున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితం తన కూతురిని కుక్కలు కరిచాయని క్రిస్టిన్ పోటర్ తండ్రి బిల్ కీఫర్ తెలిపారు. క్రిస్టిన్ పోటర్ భర్త చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు. 2020లో బైక్‌పై వెళుతుండగా ఆమె 11 ఏళ్ల వయస్సున కొడుకు మృతి చెందాడు. ఆ విషాదాలన్నింటికి తట్టుకుని తన కూతురు తేరుకుందని తెలిపారు. అంతేకాదు ఇటీవలే వేరే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో తన కాబోయే భర్తతో కలిసి ఫ్లోరిడాకు వెళ్లాలనుకున్నట్లు బంధువులు తెలిపారు.

ఈ ఘటనకు కారణమైన కుక్కలను పెంచిన యజమాని సబాత్నే పై కేసు పెడతారా? అనేది అస్పష్టంగానే ఉంది.

click me!