coronavirus: కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి పలు టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్ తనలో మార్పులు చేసుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. మానవ మనుగడకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలోనే డెన్మార్మ్ సైంటిస్టులు కరోనాను ఏదుర్కొవడానికి మరో కొత్త పదార్థాన్ని కనుగొన్నారు.
coronavirus: ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కరోనా వైరప్ ప్రభావం కొనసాగుతోంది. దీని కట్టడి కోసం టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా వైరస్ తనలో మార్పులు చేసుకుంటూ మరింత ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగానే ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ ప్రపంచంలోని 70 కి పైగా దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. పలు దేశాల్లో మరింత ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పరిశోధనలు సైతం చాలా దేశాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనేందుకు డెన్మార్ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పదార్థాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి నివారణకు వాడుతున్న యాంటీ బాడీలను తయారు చేసే ఖర్చుకంటే తక్కువ ఖర్చుతోనే దీనిని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్హస్ యూనివర్సిటీ (Aarhus University in Denmark) చేపట్టిన ఈ పరిశోధనల వివరాలను పీఎన్ఏఎస్ పత్రిక ( journal PNAS) వెల్లడించింది.
undefined
PNAS journal లో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి డెన్మార్క్ శాస్త్రవేత్తలు కొత్త కాంపౌండ్ ను తయారుచేశారు. కరోనా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే విధంగా ఒక చిన్న సైజు ఆర్గానిక్ కాంపౌండ్‌ను డెన్మార్క్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని పేర్కొంది. ఈ ఆర్గానిక్ కాంపౌండ్‌ను మాలిక్యూల్ (molecule )గా పేర్కొన్నారు. ఇది ఎంఆర్ఎన్ఏ (mRNA) ఆస్టామర్స్ జాతికి చెందినది. ఆర్ఎన్ఏ టీకాలు తయారీలో వినియోగించే బిల్డింగ్ బ్లాక్స్ ఈ కాంపౌండ్‌లో ఉంటాయని డెన్మార్క్ పరిశోధకులు పేర్కొన్నారు. ఇది కరోనా వైరస్ ఉపరితలానికి అంటుకోగానే వైరస్‌లో దాగిన స్పైక్ ప్రొటీన్ మానవ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చని శాస్తవేత్తలు వెల్లడించారు. దీని పనితీరు అత్యంత మెరుగ్గా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. తాము అభివృద్ధి చేసిన పదార్థంలోని అణువులు కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్‌లను గుర్తించి వాటికి అతుక్కుపోతాయి. దీని ద్వారా అవి శరీరంలో ఇతర కణాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు.
Also Read: Gwalior | ఉద్యోగులను ఉరి తీస్తానంటూ కలెక్టర్ వార్నింగ్.. వైరలవుతున్న వీడియో
కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి తాము అభివృద్ధి చేసిన ఈ కొత్త పదార్థంలో అస్టామర్ తరగతికి చెందిన అణువులు ఉంటాయని డెన్మార్క్ సైంటిస్టులు వెల్లడించారు. వీటి ఆకృతి 3డీ రూపంలో ఉంటుందని తెలిపారు. వీటిలో డీఎన్ఏ(Deoxyribonucleic acid), ఆర్ఎన్ఏ (Ribonucleic acid) జన్యు పదార్థాలు ఉంటాయని తెలిపారు. ఇవి నిర్థిష్ట అణువులను గుర్తించి వాటిని లక్ష్యంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. దీంతో వైరస్ అంతర్గత శరీరంలోకి ప్రవేశించకుండా ఈ ఆస్టామర్‌లు అడ్డుకుంటాయి. కనుకనే శాస్త్రవేత్తలు ఈ ఆర్ఎన్ఏ ఆస్టామర్లతో కూడిన అణువులతో కొత్త పదార్థాన్ని తయారు చేశారు. నానో, యాంటీ బాడీలకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త పదార్థం స్పైక్ ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేసేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. వీటిని ఇప్పటికే సాధారణ కరోనా వైరస్‌తో పాటు పలే వేరియంట్లపైనా పరీక్షించినట్టు సైంటిస్టులు తెలిపారు. ఈ కొత్త ఆస్టామర్లు బీటా, డెల్టా వంటి వేరియంట్ల కరోనా వైరస్‌లను సులభంగా గుర్తించాయన్నారు. ఇది కరోనా వైరస్‌ను నిరోధించడానికే కాకుండా, గుర్తించడానికి కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పైనా ఈ పదార్థంలో పరిశోధనలు చేయనున్నామని డెన్మర్క్ సైంటిస్టులు పేర్కొన్నారు.
Also Read: Punjab polls | కేజ్రీవాల్ తిరంగా యాత్ర.. పంజాబ్‌లో కాకరేపుతున్న రాజకీయం !