కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడి చివరికి ఐసీయూలో సైతం చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడి చివరికి ఐసీయూలో సైతం చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాను జీవితాంతం సెయింట్ థామస్ ఆసుపత్రి వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని జాన్సన్ తెలిపినట్లుగా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అంతకుముందు కరోనా పాజిటివ్ అని తేలడంతో బోరిస్ జాన్సన్ స్వయంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే వ్యాధి తీవ్రత పెరిగి, ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.
Also Read:కరోనా వేళ ఆన్ లైన్ క్లాసులు.. నగ్నంగా వీడియో ముందుకొచ్చి..
కోలుకున్న అనంతరం ఆదివారం ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ప్రధాని కోలుకుంటున్నారని, గతంలో కంటే ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
undefined
కాగా ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 78 వేలకు చేరింది. శనివారం ఒక్కరోజే 10,000 కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు యూకేలో సుమారు 9 వేల మంది మరణించారు.
Also Read:కరోనా విలయతాండవం.. అమెరికాలో ఒక్కరోజే 2వేల మంది బలి
ప్రధాని ఆరోగ్యంపై భారత సంతతి బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మాట్లాడుతూ.. ఆయనకు మరికొంత సమయం విశ్రాంతి అవసరమన్నారు. జాన్సన్ త్వరలోనే తిరిగి తన కార్యాలయంలో విధులకు హాజరవుతారని ఆమె ఆకాంక్షించారు.