కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే సుమారు 16,697 మంది మృతి చెందారు. సుమారు 4.5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో తమను వేరే జైళ్లకు పంపాలని చికాగో కుక్ కౌంటీ జైలు ఖైదీలు పెట్టుకొన్న వినతిని జడ్జి తోసిపుచ్చారు.
చికాగో:కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే సుమారు 16,697 మంది మృతి చెందారు. సుమారు 4.5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో తమను వేరే జైళ్లకు పంపాలని చికాగో కుక్ కౌంటీ జైలు ఖైదీలు పెట్టుకొన్న వినతిని జడ్జి తోసిపుచ్చారు.
చికాగో నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న జైళ్లకు తమను మార్చాలని చికాగోలోని కుక్ కౌంటీ జైలు ఖైదీలు పిటిషన్ పెట్టుకొన్నారు. సుమారు 4500 మంది ఖైదీలు ఈ పిటిషన్ పెట్టుకొన్నారు. అయితే ఇంత మంది ఖైదీలను వేరే జైలుకు తరలించడం సాధ్యం కాదని జిల్లా జడ్జి మాథ్యూ కెన్నెల్లి పేర్కొన్నారు.
undefined
ఖైదీల పిటిషన్‌ను కొట్టివేశారు.జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి రక్షణకు చర్యలు ముమ్మరం చేయాలని కుక్ కౌంటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జైల్లో ఉన్న ఖైదీలకు శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందించాలని జడ్జి ఆదేశించారు.
Also read:కరోనా ఎఫెక్ట్: వుహాన్‌లో 73 రోజులుగా ఒకే గదిలో ఇండియన్
కుక్ కౌంటీ జైల్లో ఇప్పటి వరకు 276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఈ వ్యాధితో ఒకరు మరణించారు. 172 మంది జైలు సిబ్బందికి కూడా వైరస్ సోకడం గమనార్హం. చిన్న చిన్న నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను బెయిల్‌పై విడుదల చేస్తామని జైలు అధికారులు వెల్లడించారు.