కరోనా భయం వెంటాడుతున్నా.. తోటి మనిషికి అండగా: చైనీయుల మానవత్వం

By Siva KodatiFirst Published Mar 9, 2020, 9:00 PM IST
Highlights

కరోనా ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి మరణించినప్పుడు చైనీయులు అటువైపు వెళ్లడానికే భయపడ్డారు. ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అక్కడ కరోనా వ్యాప్తిగా స్వల్పంగా తగ్గింది. 

కరోనా వైరస్ భయంతో మనుషుల మధ్య సంబంధాలు దిగజారిపోతున్న సంగతి తెలిసిందే. పక్కనే కూర్చోవడానికి, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా జనాలు బెంబేలేత్తిపోతున్నారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి మరణించినప్పుడు చైనీయులు అటువైపు వెళ్లడానికే భయపడ్డారు.

ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అక్కడ కరోనా వ్యాప్తిగా స్వల్పంగా తగ్గింది. ఇలాంటి సమయంలో చైనీయులు ఓ మంచి పని కోసం ముందుకు వచ్చారు చైనా ప్రజలు. కరోనా ఆందోళనలు ఉన్నప్పటికీ, రోడ్డుపై పడిపోయిన యాపిల్స్‌ను పలువురు చైనీయులు జాగ్రత్తగా ఏరి వాటి యజమానికి అందజేశారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో యుద్ధం... భారీగా తగ్గనున్న చమురు ధరలు

వివరాల్లోకి వెళితే.. చైనాలోని బోజౌలో రద్దీగా ఉన్న ఓ జంక్షన్ వద్ద ట్రై సైకిల్‌ కారుకు తగలడంతో అందులోని మనిషితో పాటు యాపిల్స్ కూడా కిందపడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

కరోనా భయంతో తోటి మనిషిని తాకేందుకే భయపడుతున్నప్పటికీ మానవత్వంతో ఆలోచించి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాదాపు 20 మంది కలిసి కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లోనే రోడ్డుపై పడిపోయిన యాపిల్స్‌‌ను ఏరి బాక్సుల్లో పెట్టారు.

Also Read:కరోనా మహమ్మారికి మందు దొరికింది: ఏప్రిల్ నుంచి మనుషులపై ప్రయోగం

ఆ తర్వాత యాపిల్ బాక్సులను ట్రై సైకిల్‌లో ఎక్కించారు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం ఇలాంటి చర్యల వల్ల కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 

click me!