
మెటా ప్లాట్ ఫామ్స్ (మెటా)పై దావా వేస్తామని ట్విట్టర్ హెచ్చరించింది. కొత్తగా ప్రారంభమైన థ్రెడ్స్ ప్లాట్ ఫామ్ విషయంలో ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మార్క్ జుకర్ బర్గ్ కు ట్విట్టర్ న్యాయవాది అలెక్స్ స్పిరో ఓ లేఖ పంపించారు. మెటా బుధవారం థ్రెడ్స్ ను ప్రారంభించింది. 30 మిలియన్లకు పైగా సైన్ అప్ లను లాగిన్ చేసింది. ఈ ఫ్లాట్ ఫామ్ కోసం మెటా, ఇన్ స్టాగ్రామ్ లలో ఉన్న బిలియన్ల మంది వినియోగదారులను ఉపయోగించుకొని.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కు పోటీ ఇవ్వాలని చూస్తోంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. డబుల్ డెక్కర్ బస్సును ఢీకొన్న మరో బస్సు.. 80 మందికి గాయాలు.. న్యూయార్క్ లో ఘటన
అయితే ఈ కొత్త ఫ్లాట్ ఫామ్ పై ట్విట్టర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు స్పిరో జుకర్ బర్గ్ కు పంపిన లేఖలో.. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను మెటా నియమించుకుందని ఆరోపించారు. ‘‘ఆ ఉద్యోగులు ట్విట్టర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత రహస్య సమాచారాన్ని కలిగి ఉన్నారు. కొనసాగిస్తున్నారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారని న్యూస్ వెబ్ సైట్ సెమాఫోర్ నివేదించింది.
‘‘ట్విట్టర్ తన మేధో సంపత్తి హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటుంది. ట్విట్టర్ వాణిజ్య రహస్యాలు లేదా ఇతర అత్యంత రహస్య సమాచారాన్ని ఉపయోగించకుండా, మెటా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది’’ అని లేఖలో స్పిరో పేర్కొన్నారు.
నేడు యూపీలో మోడీ టూర్: రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ
కాగా.. థ్రెడ్స్ ఇంజనీరింగ్ బృందంలో ఎవరూ మాజీ ట్విట్టర్ ఉద్యోగి లేరని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ ఓ థ్రెడ్స్ పోస్ట్ లో చెప్పారు. అయితే థ్రెడ్స్ లో పనిచేస్తున్న ట్విట్టర్ మాజీ సిబ్బంది గురించి గానీ, మెటాలో దిగిన సీనియర్ సిబ్బంది గురించి గానీ తమకు తెలియదని మాజీ సీనియర్ ట్విటర్ ఉద్యోగి ఒకరు ‘రాయిటర్స్’కు తెలిపారు. ఈ పరిణాలపై ట్విట్టర్ యజమాని స్పందించారు. పోటీ మంచిదే కానీ.. మోసం మంచిది కాదని చెప్పారు.