
జోహన్నెస్‌బర్గ్ : జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని దక్షిణాఫ్రికా మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది మరణించారు. కొంతమంది వ్యక్తులు కోలుకున్న తరువాత మరణాల సంఖ్యను సవరించినట్లు అత్యవసర సేవలు గురువారం తెలిపాయి.బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాలతో ముడిపడి ఉందని భావించారు. జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.
"సంఘటనా స్థలంలో 16 మంది చనిపోయారని నిర్ధారించాం. పారామెడిక్స్ జోక్యంతో మరికొందరిని గుర్తించాం.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు" అని అత్యవసర సేవల ప్రతినిధి విలియం నట్లాడి చెప్పారు.
లోయలో పడ్డ బస్సు.. 27 మంది మృతి.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
ఆసుపత్రిలో ఉన్నవారిలో, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 11 మంది పరిస్థితి సీరియస్ గానే ఉన్నా స్టేబుల్ గా ఉందని ఆయన చెప్పారు. ఇందులో ఓ మైనర్ పూర్తిగా స్పృహలో ఉన్నాడని ఆయన తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి రాత్రి 8 గంటల సమయంలో గ్యాస్ పేలుడు జరిగిందని కాల్ వచ్చింది. అయితే అక్కడికి వెళ్లి చూసేసరికి అది "విషపూరిత వాయువు" ఉన్న "సిలిండర్ నుండి గ్యాస్ లీకేజీ" అని తెలిసిందన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్‌ను అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దక్షిణాఫ్రికాలో 32 శాతం కంటే ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నారు. దీంతో "జమా జమాస్" అనే మారుపేరుతో వేలాదిమంది అక్రమ మైనర్లుగా అవతారం ఎత్తుతున్నారు. రిజిస్టర్ కానీ వేలాది మంది మైనర్లు కష్టతరమైన, ప్రమాదకర పరిస్థితుల్లో బంగారం కోసం గనుల్లో వేట సాగిస్తున్నారు.
దక్షిణాఫ్రికా వాణిజ్య కేంద్రమైన జోహన్నెస్‌బర్గ్, దాని పరిసర ప్రాంతాలు 1880లలో గోల్డ్ రష్ ఏర్పడింది. అప్పటినుంచి ఇక్కడ గనుల్లో బంగారం వెలికితీయడం ప్రారంభించారు. అప్పటినుంచి తరాలుగా మైనింగ్ కంపెనీలు ఇక్కడ బంగారం వెలికి తీస్తున్నాయి. అలా గుట్టలుగా మట్టి పేరుకుపోయి.. మట్టిదిబ్బలు, గుహలు ఏర్పడ్డాయి.
జోహన్నెస్‌బర్గ్‌లోని మధ్యతరగతి శివారు ప్రాంతమైన బోక్స్‌బర్గ్ గత నెలలో 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వల్ల ఏర్పడిన ఉన్న భూగర్భ సొరంగాలు, షాఫ్ట్‌లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
అదే శివారు ప్రాంతంలో గత ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ని తీసుకువెళుతున్న ట్రక్కు వంతెన కింద ఇరుక్కుపోయి, లీక్, పేలుడు సంభవించి 41 మంది మరణించారు. పేలుడు తర్వాత సమీపంలోని ఆసుపత్రిలో తీవ్రమైన కాలిన గాయాలతో డజన్ల కొద్దీ రోగులు, సిబ్బంది చికిత్స తీసుకున్నారు.