ఆఫ్ఘనిస్తాన్‌: తాలిబన్లకు తిరుగుబాటుదారులు షాక్.. 11 మంది ఫైటర్లు హతం, బందీలుగా మరికొందరు

Siva Kodati |  
Published : Aug 22, 2021, 07:42 PM ISTUpdated : Aug 22, 2021, 07:43 PM IST
ఆఫ్ఘనిస్తాన్‌: తాలిబన్లకు తిరుగుబాటుదారులు షాక్.. 11 మంది ఫైటర్లు హతం, బందీలుగా మరికొందరు

సారాంశం

బాగ్లాన్‌లో తిరుగుబాటుదారులు తాలిబన్లపై  కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది  తాలిబన్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా  తెలుస్తోంది. కమాండర్‌తో పాటు ఏడుగురు తాలిబన్లను తిరుగుబాటుదారులు బంధించారు. 

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు ఈసారి పరిస్థితులు ఏ మాత్రం బాలేదని అర్థమవుతోంది. తాజాగా తాలిబన్లపై తిరుగుబాటుదారులు దాడులకు తెగబడ్డారు. బాగ్లాన్‌లో తిరుగుబాటుదారులు తాలిబన్లపై  కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది  తాలిబన్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా  తెలుస్తోంది. కమాండర్‌తో పాటు ఏడుగురు తాలిబన్లను తిరుగుబాటుదారులు బంధించారు. 

కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. కాబూల్ విమానాశ్రయం వద్ద గాల్లోకి తాలిబన్లు కాల్పులు జరపడంతోనే పరిస్ధితులు అదుపు తప్పినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నాక కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశీయులు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద గత వారం రోజులుగా తీవ్ర రద్దీ నెలకొని వుంది. పలుమార్లు తొక్కిసలాట జరిగింది. ఇప్పటి  వరకు వారం రోజుల్లో 20 మంది చనిపోయారని నాటో అధికారులు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?