ఆఫ్ఘనిస్తాన్: వారం రోజుల్లో 20 మంది మృతి... నాటో అధికారిక ప్రకటన

By Siva KodatiFirst Published Aug 22, 2021, 5:42 PM IST
Highlights


ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వెళ్లేందుకు ఆఫ్ఘన్లు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తడంతో వద్ద గత వారం రోజులుగా తీవ్ర రద్దీ నెలకొని వుంది. పలుమార్లు తొక్కిసలాట జరిగింది. ఇప్పటి  వరకు వారం రోజుల్లో 20 మంది చనిపోయారని నాటో అధికారులు ప్రకటించారు.

కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. కాబూల్ విమానాశ్రయం వద్ద గాల్లోకి తాలిబన్లు కాల్పులు జరపడంతోనే పరిస్ధితులు అదుపు తప్పినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ను  తాలిబన్లు వశం చేసుకున్నాక కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశీయులు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు.

Also Read:20 ఏళ్ల అభివృద్ధి మట్టిపాలైంది.. నాకు దు:ఖం ఆగడం లేదు, ఢిల్లీ చేరుకున్నాక ఆఫ్ఘన్ సెనేటర్ కన్నీరు

ఎయిర్‌పోర్ట్ వద్ద గత వారం రోజులుగా తీవ్ర రద్దీ నెలకొని వుంది. పలుమార్లు తొక్కిసలాట జరిగింది. ఇప్పటి  వరకు వారం రోజుల్లో 20 మంది చనిపోయారని నాటో అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఇవాళ తెల్లవారుజామున మరో 87 మంది  భారతీయులను సురక్షితంగా చేర్చారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ 17 విమానం హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. ఆఫ్ఘన్ చెర నుంచి సేఫ్‌గా భారత్‌కు చేరుకోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లువెత్తింది. 

click me!