Afghan crisis: కాబూల్ విమానాశ్రయం వద్ద తాలిబాన్ల కాల్పులు... ఏడుగురు మృతి

By Arun Kumar PFirst Published Aug 22, 2021, 1:32 PM IST
Highlights

అప్ఘానిస్తాన్ తాలిబాన్ల అరాచక పాలన సాగుతోంది. దీంతో దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు కాబూల్ విమానాశ్రయం వద్ద ప్రాణాలు కోల్పోయారు. 

కాబూల్: అప్ఘానిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో ఆస్తులను కూడా వదులుకుని దేశాన్ని విడిచివెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని చాలామంది చూస్తున్నారు. వారంతా అప్ఘాన్ రాజధాని కామూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో విమానాశ్రయం వద్ద భారీగా ప్రజలు గుమిగూడటంతో పరిస్థితి అదుపుతప్పుతోంది. 

ఇలా ఆదివారం కూడా విమానాశ్రయం వద్దకు భారీగా జనాలు చేరుకోవడంతో వారిని అదుపుచేయడానికి తాలిబాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు పరుగు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించినట్లు బ్రిటన్‌ రక్షణశాఖ ప్రకటించింది. 

read more  ఆఫ్ఘనిస్తాన్: భారతీయుల తరలింపు, కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ప్రతిరోజూ కాబూల్ నుంచి ఢిల్లీకి విమానాలు

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో భయానక పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. అప్ఘాన్ లోని తమ దేశ పౌరులెవ్వరూ కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్దకు వెళ్లకూడదని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ గేట్ల వద్ద ఉద్రిక్త పరిస్ధితి వుందని ఈ సమయంలో అక్కడికి వెళ్లొద్దని ఆదేశించింది. 

ఇక ఆఫ్ఘాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రతి రోజు రెండు విమానాలు నడపాలని నిర్ణయించింది. 

ఇక తాలిబన్ల చెరలో వున్న భారతీయులు క్షేమంగా వున్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. అటు అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంలో వారిని తరలించే అవకాశం వుంది. 

 కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాదాపు 150 మంది భారతీయులను బందీలుగా చేసుకున్నారు తాలిబన్లు. విమానాశ్రయం నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ట్రక్కుల్లో తరలించారు. ప్రయాణ పత్రాలు, గుర్తింపు  కార్డులు పరిశీలించారు. ఆఫ్ఘన్‌లో ఇంకా 1000 మందికి పైగా భారతీయులు వున్నట్లు సమాచారం. చాలా మంది భారత దౌత్య కార్యాలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోలేదు. 

click me!