93% సంపద కోల్పోయిన చైనా కుబేరుడు.. ఇల్లు, ప్రైవేట్ జెట్‌లనూ అమ్ముకున్నాడు..గాలిలో దీపంలా 2లక్షల మంది ఉద్యోగులు

By Mahesh KFirst Published Jan 22, 2023, 6:26 PM IST
Highlights

చైనాకు చెందిన అపర కుబేరుడు హుయి కా యాన్ సంపద అనూహ్యంగా ఆవిరైంది. 2021 నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో వచ్చిన సవాళ్లు, దేశ క్రెడిట్ క్రంచ్ కారణంగా కంపెనీ దారుణంగా నష్టపోయింది. ఫలితంగా ఆసియాలోనే రెండో అపర కుబేరుడిగా వర్ధిల్లిన హుయి కా యాన్ 93 శాతం సంపద కోల్పోయాడు.
 

న్యూఢిల్లీ: చైనాలో ఎవర్‌గ్రాండీ గ్రూప్ చాలా పెద్ద కంపెనీ. సుమారు 2 లక్షల మందికి జీవనోపాధిని ఇస్తున్నది. అంటే ఈ కంపెనీలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2020లో 110 బిలియన్ డాలర్ల సేల్స్ నమోదు చేసింది. చైనా ప్రభుత్వం ప్రముఖులతో నిర్వహించి చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్‌కు తప్పకుండా ఎవర్‌గ్రాండీ గ్రూప్ చైర్మన్ హుయి కా యాన్ హాజరయ్యేవారు. ఆయన ఆసియాలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా వర్ధిల్లాడు. 42 బిలియన్ డాలర్ల సంపన్నుడు.

కానీ, 2021 నుంచి ఆయన ఒక్కసారిగా నేలమీద పడినట్టయింది. ఈయన డెవలపర్‌కు 300 బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చైనా ఎదుర్కొన్న రియల్ ఎస్టేట్ సమస్యల్లో ఎవర్‌గ్రాండీ సెంటర్‌లో ఉన్నది. దీంతో ఆ అపర కుబేరుడి గ్రాఫ్ ఒక్కసారిగా పతనమైంది. ఇప్పుడు అతని సంపద 3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. తన కంపెనీని ఆదుకోవడానికి అతను తన ఇళ్లను, ప్రైవేట్ జెట్‌లనూ అమ్మేసుకున్నాడు.

సంపన్నుడు, రాజకీయంగానూ అశేష పలుకుబడి ఉన్న హుయి కా యాన్ ఇప్పటి పరిస్థితి వేరుగా ఉన్నది. రాజకీయంగానూ ఆయన ప్రాధాన్యం పడిపోవడంతో సాధారణ ప్రజల్లోనూ కంపెనీపై నమ్మకం సడలుతున్నది. చైనా ప్రభుత్వం నిర్వహించే కాన్ఫరెన్స్‌కు కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. దేశ రుణ పరపతి కోత ఈ కంపెనీ శరాఘాతంగా మారింది.

Also Read: దేశంలో 40 శాతం సంపద ఒక్కశాతం ధనికులది.. సగం జనాభా దగ్గర ఉన్నది 3 శాతం సంపదే: సంచలన నివేదిక

ఆసియాలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా వెలుగొందిన హుయి కా యాన్ ఇలా ఒక్కసారిగా కిందికి పడిపోతుండటం నమ్మశక్యంగా లేదు. కానీ, అదే కఠిన వాస్తవంగా కంపెనీ ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.

2023 సంవత్సరం మనకు చాలా కీలకమైనదని, మన సంస్థ అన్ని ప్రాజెక్టులను సఫలం చేస్తుందని భావిస్తున్నట్టు నూతన సంవత్సర గ్రీటింగ్స్‌లో ప్రాపర్టీ మ్యాగ్నెట్ హుయి కా యాన్ తెలిపారు.

గత రెండేళ్లలో చైనాకు చెందిన ఐదుగురు అత్యంత సంపన్నులైన ప్రాపర్టీ టైకూన్లు మొత్తంగా దాదాపు 65 బిలియన్ డాలర్లు కోల్పోయారు.

click me!